నక్క కోసం ఉచ్చు పన్నితే పులి వచ్చి..

leopard

నక్కను పట్టుకోవడానికి ఉచ్చు పన్నితే పులి వచ్చి ఇరుక్కుంది. అసోంలోని దిబ్రూఘర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. బలాయ్ థాన్ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి కోళ్లఫామ్ నిర్వహిస్తున్నాడు. ఐతే, ఆ కోళ్లఫామ్‌లోని కోళ్లను రాత్రిపూట ఏదో జంతువు వచ్చి తినేస్తోంది. అడవి నుంచి నక్క వచ్చికోళ్లను తినేస్తోందని భావించిన ఫామ్‌ యజమాని, నక్కను బంధిం చడానికి ఉచ్చుపన్నాడు. ఆ ఉచ్చులో జంతువు పడగానే ఇంట్లో అలారం మోగేలా ఏర్పాటు చేసుకున్నాడు.

రాత్రి ఒంటిగంట సమయంలో ఫామ్‌ యజమాని ఇంట్లో అలారం మోగింది. దాంతో నక్క చిక్కిందని యజమాని సంబరపడ్డాడు. తెల్లారి లేచి చూసి అతను షాక్ అయ్యాడు.

తాను పన్నిన ఉచ్చులో కోళ్లను చంపి తింటున్న నక్క పడిపోయిందని అనుకున్నాడు. ఐతే, అతను అనుకున్నది ఒక్కటి జరిగింది మరొకటి. నక్క కోసం ట్రాప్ ఏర్పాటు చేస్తే అందులో పులి వచ్చి ఇరుక్కుంది. ఆ విషయం తెలిసిన గ్రామస్థులు, టైగర్‌ను చూడడానికి పెద్ద ఎత్తున తరలివచ్చారు.

TV5 News

Next Post

నిరుద్యోగ సమస్య దేశానికి పెను సవాల్‌గా మారింది: ఆజాద్

Tue Nov 5 , 2019
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అన్ని రంగాల్లోనూ విఫలమైందని.. కాంగ్రెస్ సీనియర్ నేత గులాంనబీ ఆజాద్ అన్నారు. పేదప్రజల ఖాతాల్లో 15 లక్షలు, రైతులకు మద్దతు ధర అంటూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ప్రధాని మోదీ నెరవేర్చలేదన్నారు. హైదరాబాద్ వచ్చిన ఆజాద్.. గాంధీ భవన్‌లో పార్టీ నేతలతో సమావేశమై.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను విమర్శించారు. కాంగ్రెస్ హయాంలో దేశ స్థూల జాతీయోత్పత్తి 10 శాతంగా ఉంటే బీజేపీ పాలనలో అది 5 […]