రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్నట్లా.. లేనట్లా.. – లోకేశ్

సీఎం జగన్‌పై ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్. అసలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్నట్లా.. లేనట్లా అంటూ నిలదీశారు. మాజీ సీఎం చంద్రబాబుపై సోషల్ మీడియాలో అవమానకర రీతిలో పోస్టులు పెట్టిన వాళ్లపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదో చెప్పాలన్నారు. మీ చట్టాలన్నీ టీడీపీ అభిమానులపై కేసులు పెట్టేందుకేనా అని ప్రశ్నించారు లోకేశ్ .

అవమానకర రీతిలో మార్ఫింగ్ చేయడాన్ని భావప్రకటన స్వేచ్ఛ అంటే అది టీడీపీ వాళ్లకు కూడా వర్తిస్తుందన్నారు లోకేష్. గతంలో టీడీపీ కార్యకర్తలపై పెట్టిన కేసుల్ని వెనక్కి తీసుకొని.. వాళ్లకు బహిరంగ క్షమాపణలు చెబుతారా అని ప్రశ్నించారు. గౌరవ హోం మంత్రి సుచరితగారు ఇలాంటి మార్ఫింగ్‌లకు ఏం సమాధానం చెబుతారని నిలదీశారు లోకేశ్.


Also watch :

TV5 News

Leave a Reply

Your email address will not be published.

Next Post

ప్రపంచ విషాదాల్లో ఒకటిగా నిలిచిపోయిన దాడుల్లో..

Wed Sep 11 , 2019
2001, సెప్టెంబ‌ర్ 11.. సరిగ్గా 18 ఏళ్ల క్రితం.. యావత్తూ అమెరికా దద్దరిల్లింది. శత్రు దుర్బేధ్యం అంటూ మురిసిపోయే అగ్రరాజ్యం అభిజాత్యంపై భయంకరమైన దెబ్బ పడింది. అమెరికా పాలకులు, ప్రజలకు వెన్నులో వణుకుపుట్టించేలా ఉగ్రవాదులు పంజా విసిరారు. కనీవినీ ఎరుగని రీతిలో విమానాలతో స్వైర విహారం చేశారు. WTC జంట భవనాలతో పాటు ఏకంగా పెంటగాన్ రక్షణ కార్యాలయంపైనే దాడి చేసి దిగ్భ్రాంతికి గురి చేశారు. ఆ మారణహోమానికి సంబంధించి […]