రైతు భరోసా కార్యక్రమంపై నారా లోకేష్ విమర్శలు

ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు భరోసా కార్యక్రమంపై విమర్శలు గుప్పించారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. సీఎం జగన్‌ గారు ప్రవేశపెట్టింది వైఎస్‌ఆర్ రైతు నిరాశ కార్యక్రమం అన్నారు. ఎన్నికల హామీలో రైతుభరోసా కింద 12వేల 500 ఇస్తామని ప్రకటించి.. ఇప్పుడు కేవలం 7,500 ఇస్తూ రైతులకు రివర్స్ టెండర్ వేశారని విమర్శించారు లోకేష్. 64 లక్షల మంది రైతుల్లో సగం మందిని తగ్గించారని ఆరోపించారు. కులాన్ని చూడం అంటూనే ఓసీలైన రైతులకు మొండిచేయి చూపారంటూ ఎద్దేవా చేశారు. పెట్టుబడి సాయం ఒకేసారి ఇస్తామని మొదట చెప్పి.. ఇప్పుడు విడతల్లో ఇస్తూ మడమ తిప్పారని విమర్శించారు లోకేష్.

TV5 News

Next Post

చర్చలు జరిపేందుకు ప్రభుత్వం నుంచి నాకు అనుమతి రాలేదు - కేకే

Tue Oct 15 , 2019
సీఎం కేసీఆర్‌ ఆదేశిస్తే ఆర్టీసీ సమ్మె విషయంలో మధ్యవర్తిగా ఉంటానని స్పష్టం చేశారు ఎంపీ కేశవరావు. సమ్మె విషయంలో సీఎం నన్ను ఇప్పటి వరకు పిలవలేదని.. ఆర్టీసీ కార్మికులు కూడా కలవలేదన్నారు. ఇద్దరు ఆర్టీసీ కార్మికులు చనిపోయారన్న బాధతో సోమవారం ప్రకటన జారీ చేశానని చెప్పారు కేకే. కార్మికులు తనతో చర్చలకు సానుకూలంగా వుండటం మంచి పరిణామమని అన్నారు. సీఎం కేసీఆర్‌తో మాట్లాడేందుకు ప్రయత్నం చేస్తున్నానని.. ఆయన అందుబాటులోకి రాలేదని […]