క‌ృష్ణాజిల్లాలో పోలీసుల ఓవరాక్షన్.. జర్నలిస్టులపై లాఠీచార్జ్

Read Time:0 Second

కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్‌లో పోలీసుల ఓవరాక్షన్ ఓ రేంజ్‌లో ఉంది. ఓ చిన్న విషయంపై ప్రశ్నించినందుకు జర్నలిస్టులపై విచక్షణా రహితంగా దాడి చేశారు. లాఠీఛార్జ్‌లో ఆరుగురు విలేఖరులకు తీవ్ర గాయాలయ్యాయి. ఏలూరు నుంచి డ్యూటీకి వచ్చిన డీఎస్పీ సిబ్బంది వ్యవహరించిన తీరుకు నిరసనగా జర్నలిస్టులంటా రోడ్డుపైనే బైఠాయించి నిరసన తెలిపారు. కరోనా ఎఫెక్ట్ నేపథ్యంలో ప్రజలకు ఎప్పటికప్పుడు సమాచారం చేరవేసేందుకు ప్రయత్నం చేస్తున్న మీడియాపై పోలీసులు ఇంత దురుసుగా ప్రవర్తించడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. కేంద్ర ప్రభుత్వమే మీడియాకు అనుమతి ఇచ్చినా.. పోలీసుల ఓవరాక్షన్ ఏంటని జర్నలిస్ట్‌లు ప్రశ్నిస్తున్నారు.

0 0
Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleppy
Sleppy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Close