అందం అమ్మాయయితే నీలా ఉంటుందా.. నిజంగా మీకు అంత వయసు!!

పాలుగారే చెక్కిళ్ళతో పదహారేళ్ల పడుచుపిల్ల అందంగా కవ్విస్తూ, వయ్యారాలు వలకబోస్తుంటే.. వావ్.. సో.. క్యూట్. దివి నుంచి భువికి దిగివచ్చిన దేవకన్యలా ఎంత అందంగా మెరిసిపోతోందో అంటారు. మరి 52 ఏళ్ల వయసులోనూ అదే ఫిజిక్‌ని, అదే అందాన్ని మెయింటైన్ చేస్తే.. అవునా అదెలా సాధ్యం అంటారు. శరీరం మీద కాస్త శ్రద్ద పెడితే అద్భుతాలు చేయొచ్చంటారు సినీ తారలు. నా వయసుని అసలు కనబడనివ్వదు నా కోమలమైన చర్మం అనే సంతూర్ మమ్మీలా ఉంటారు అందరూ అని చెబుతుంటారు. అయినా అందంది ఏవుందండి.. మనసు అందంగా ఉండాలి.. అంటే స్వచ్ఛంగా ఉండాలి. అందర్నీ నవ్వుతూ పలకరించాలి. అదే మీ ముఖానికి అందాన్నిస్తుంది. మీకెంత వయసు అనేది అనవసరం. అందరూ సినిమా తారలు కాలేరుగా. వారి వారి రంగాల్లో రాణిస్తూ, ప్రతిభను కనబరిస్తే అందంతో పనేముంది.

80-90లలో బాలీవుడ్ అగ్రకథానాయికగా వెలుగొందిన మాధురీ దీక్షిత్.. ఛోళీ కే పీచే క్యా హై అంటూ కుర్రకారుని ఒక ఊపు ఊపింది. నిజానికి అందాల తార శ్రీదేవి తరువాత ఆ రేంజ్‌లో ఫాలోయింగ్ సంపాదించుకున్న హీరోయిన్ మాధురీ దీక్షిత్ మాత్రమే. ఈ జనరేషన్ బాలీవుడ్ స్టార్స్ అందరూ మాధురీకి అభిమానులే. తాజాగా మాధురి తన ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని ఫొటోలు పోస్ట్ చేశారు. ఈ ఫోటోలకు ‘ముందడుగు వేయండి.. తారలా మెరవండి’ అని క్యాప్షన్ కూడా ఇచ్చారు. ఈ ఫోటోల్లో ఆమె అందమైన క్యాస్ట్యూమ్స్ ధరించారు.

ఆ డ్రెస్‌లో మాధురి అందం మరింత రెట్టింపైంది. సోషల్ మీడియాలో వైరల్ అయిన మాధురి ఫోటోలను చూసి నెటిజన్స్ ఈ వయసులో ఇంత అందంగా ఎలా అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. వారికి వచ్చిన పదాలన్నీ వాడేస్తున్నారు. సూపర్ కామెంట్లతో మాధురినీ ముంచెత్తుతున్నారు. స్టన్నింగ్ డ్రెస్ మేడమ్ అని ఒకరంటే, ఏజ్ లెస్ బ్యూటీ అని మరొకరు, అమేజింగ్ స్టిల్.. బ్యూటీఫుల్ అంటూ పొగుడుతుంటే మాధురి ఉబ్బితబ్బిబవుతున్నారు. అంతా మీ అభిమానం అంటూ ఎంతో వినమ్రంగా చెబుతున్నారు. బుల్లి తెర డ్యాన్స్ షో కార్యక్రమం ‘డ్యాన్స్ దీవానే’కి జడ్జిగా వ్యవహరిస్తున్న మాధురి అడపా దడపా సినిమాల్లో కనిపిస్తూ అభిమానులను ఆనందపరుస్తున్నారు.

 

View this post on Instagram

 

🌹 #iifa20 #iifahomecoming

A post shared by Madhuri Dixit (@madhuridixitnene) on

TV5 News

Leave a Reply

Your email address will not be published.

Next Post

ఎవరిని నిలపాలో మాకు తెలియదా : ఎంపీ కోమటిరెడ్డి

Thu Sep 19 , 2019
హుజూర్‌నగర్‌ ఉపఎన్నిక కాంగ్రెస్‌లో చిచ్చురాజేసింది. వర్గాలవారీగా విడిపోయిన నేతలు..విమర్శలు, ప్రతివిమర్శలతో ఒక్కసారిగా హీట్‌ను పెంచేశారు. తాజాగా భువనగిరి ఎంపీ కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్‌రెడ్డికి స్ట్రాంగ్ కౌంటర్ఇచ్చారు. హుజూర్‌నగర్‌లో ఎవరిని అభ్యర్థిగా నిలబెట్టాలో తమకు తెలుసని అన్నారు. ఈ మధ్యే పార్టీలోకి వచ్చిన వారి సలహాలు, సూచనలు తమకు అక్కర్లేదన్నారు. హుజూర్ నగర్ అభ్యర్థిగా రేవంత్ రెడ్డి ప్రతిపాదిస్తున్న పేరు.. తనకే […]