వినాయక నిమజ్జనంలో విషాదం.. 13 మంది మృతి..

మధ్యప్రదేశ్‌లోని ఖట్లపురాలో విషాదం చోటుచేసుకుంది. గణేష్ నిమజ్జనం వేడుకల్లో పడవ బోల్తాపడి 13 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆరుగురిని రెస్క్యూ టీమ్ కాపాడగా.. మరో ఐదుగురు గల్లంతయ్యారు. వీరి కోసం గాలింపు కొనసాగుతోంది. శుక్రవారం(13/09/2019) తెల్లవారుజామున ఘటన జరగడంతో.. సహాయ చర్యలకు ఇబ్బందులు ఎదురయ్యాయి. ప్రస్తుతం 40 మంది సాయంతో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాదం జరిగినప్పుడు బోట్‌లో పరిమితికి మించి జనం ఉండడం వల్లే ఈ దుర్ఘటన జరిగినట్టు తెలుస్తోంది. ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. మృతుల కుటుంబాలకు 4 లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. అటు, ఈ విషాదంపై పూర్తిస్థాయి విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని మధ్యప్రదేశ్ సీఎం కమల్‌నాథ్ ఆదేశించారు.

TV5 News

Leave a Reply

Your email address will not be published.

Next Post

వ్యాపారం చేయాలనుకునే మహిళలకు బ్యాంకులు, ప్రభుత్వ పథకాలు భరోసా

Fri Sep 13 , 2019
ఏదో ఒకటి చేయాలి. ఖాళీగా కూర్చోకూడదు. ఎప్పుడో నేర్చుకున్న టైలరింగ్‌ను ఉపాధిగా మార్చుకుంటే తనతో పాటు మరో నలుగురికి ఉపాధి కల్పించొచ్చు. మహిళల ఆలోచనా విధానం మారుతోంది. మగవారిపై ఆధారపడకూడదన్న భావం పెరుగుతోంది. పెళ్లవకముందు తండ్రి చాటు బిడ్డగా, పెళ్లయ్యాక భర్త చాటు భార్యగా బతకాలనుకోవట్లేదు. తనకున్న అభిరుచులు, ఇష్టా ఇష్టాలనే ఆదాయ మార్గంగా మలచుకోవాలని భావిస్తోంది. ఓ పక్క కుటుంబ బాధ్యతలను నిర్వర్తిస్తూనే, తామెంచుకున్న రంగంలో నిలబడడానికి ప్రయత్నాలు […]