పోలవరం ప్రాజెక్ట్‌ పనులు ప్రారంభించిన మేఘా ఇంజనీరింగ్ సంస్థ

pol

మేఘా ఇంజనీరింగ్‌ సంస్థ పోలవరం ప్రాజెక్ట్‌ పనులు ప్రారంభించింది. స్పిల్‌వే ప్రాంతంలో కాంక్రీట్‌ పనుల్ని ప్రారంభించింది. తొలిరోజు వంద క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్‌ పనులు చేసింది. వాస్తవానికి రోజుకు 2 వేల క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్‌ పనుల్ని చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది మేఘా సంస్థ. ఇక రాక్‌ఫిల్‌ డ్యాంలో కోటిన్నర క్యూబిక్‌ మీటర్లు పనులు చేయాల్సి ఉంది. అటు ఎర్త్‌కమ్‌ రాక్‌ ఫిల్‌ డ్యాం, ఇటు కాపర్‌ డ్యాం పనులను పూర్తి చేయనుంది మేఘా ఇంజనీరింగ్‌ సంస్థ. స్పిల్‌వే పనులు 2020 జూన్‌ నాటికి పూర్తి చేస్తామని, 2021 నాటికి పనులు పూర్తవుతాయని తెలిపింది.

TV5 News

Next Post

కేసీఆర్ దారెటు?

Thu Nov 21 , 2019
ఆర్టీసీ కార్మికులు విధుల్లో చేరాలని ప్రభుత్వం పిలుస్తుందా? అసలు సీఎం కేసీఆర్‌ వ్యూహమేంటీ? ఎలాంటి షరతులు లేకుంటే సమ్మె విరమణకు సిద్ధమని ఇప్పటికే జేఏసీ ప్రకటించింది. కానీ ఇంతవరకూ సర్కారు నుంచి ఎలాంటి స్పందన లేదు. దీంతో ఆర్టీసీ జేఏసీ నేతలు ఇంకా ఆందోళనలోనే ఉన్నారు. ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన వస్తుందనే ఆశతో ఎదురు చూస్తున్నారు. మరోవైపు అధికారులతో సీఎం కేసీఆర్‌ సమీక్ష చేస్తున్నారు. మంత్రి పువ్వాడతోపాటు ఆర్టీసీ […]