బీజేపీ నేతలకు శివసేన కౌంటర్‌

Read Time:0 Second

maha
తమ ప్రభుత్వం కేవలం 80 రోజుల కోసం ఏర్పాటు చేసింది కాదన్నారు మహారాష్ట్ర సీఎం ఉద్దవ్‌ ఠాక్రే. మహా వికాస్‌ ఆఘాడి ప్రభుత్వం పూర్తిగా ఐదేళ్లు పరిపాలిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. త్వరలోనే కేబినెట్‌ విస్తరణకు అన్ని ఏర్పాటు చేస్తోంది అన్నారు ఆయన.

కేబినెట్‌ను ఏర్పాటు చేయడంలో మహా వికాస్‌ ఆఘాడి ప్రభుత్వం విఫలమైందన్న బీజేపీ నేతల విమర్శలను శివసేన ఖండించింది. కేబినెట్‌ను ఎప్పుడు విస్తరించాలో ప్రభుత్వానికి తెలుసునని శివసేన పేర్కొంది. మహారాష్ట్ర ప్రభుత్వానికి శాంతియుతంగా కార్యకలాపాలను నిర్వహించే సత్తా ఉందని స్పష్టం చేసింది. మంత్రులకు శాఖలను కేటాయించనంత మాత్రాన వారికి ప్రాధాన్యత లేదనడం సరికాదని బీజేపీ నేతలకు కౌంటర్‌ ఇచ్చింది శివసేన. నాగ్‌పూర్‌ సమావేశం చాలా ముఖ్యమని, కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని తెలిపింది. మహారాష్ట్ర కేబినెట్‌ విస్తరణపై ఎలాంటి సందేహం అక్కర్లేదని ప్రకటించింది.

0 0
Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleppy
Sleppy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Close