అమ్మాయిలూ.. ఆర్టీసీ డ్రైవర్లు

అమ్మాయిలూ.. ఆర్టీసీ డ్రైవర్లు

అన్నిరంగాల్లో మహిళ దూసుకుపోతోంది. వచ్చిన అవకాశాల్ని అందిపుచ్చుకుంటోంది. మగవారికి ఏమాత్రం తీసిపోమంటూ గేరు మార్చి స్పీడు పెంచేస్తోంది. ఈ క్రమంలోనే మహారాష్ట్రలో ఆర్టీసి డ్రైవర్లుగా మహిళ స్టీరింగ్ తిప్పబోతోంది. రవాణా వ్యవస్థలో స్త్రీల ప్రాధాన్యతను పెంచేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలను తీసుకుంది. ఇటీవల మహారాష్ట్ర స్టేట్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (ఎంఎస్ఆర్టీసీ) నిర్వహించిన 'డ్రైవర్ కమ్ కండక్టర్' రిక్రూట్‌మెంట్‌ జరగ్గా అందులో 150 మంది మహిళలు సెలక్ట్ అయ్యారు. వీరందరికీ ఏడాది పాటు శిక్షణ ఇచ్చి విధుల్లోకి తీసుకునేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఎంఎస్ఆర్టీసీ ఈ ఏడాది 8,022 పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వగా.. 35,400 మంది దరఖాస్తు చేసుకున్నారు.

రాత పరీక్షలో 30,068 మంది ఎంపికవగా.. వీళ్లలో 742 మంది మహిళలు ఉన్నారు. సెలెక్ట్ అయిన వారిలో డాక్యుమెంటేషన్ ప్రాసెస్‌లో పాసైనవారు 150 మంది మహిళలు ఉన్నారు. మహిళలకు లైట్ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండి ఏడాది పాటు తేలికైన వాహనాలను నడిపిన అనుభవం ఉంటే వాళ్లకు ఉద్యోగం ఇచ్చేందుకు సడలింపులు ఇచ్చింది ప్రభుత్వం. డ్రైవింగ్ టెస్ట్ నుంచి కూడా మినహాయింపులు ఇచ్చింది. మొదట తక్కువ దూరం నడిపించి, ఆ తరువాత దూర ప్రాంతాలకు డ్యూటీలు వేస్తామని అధికారులు చెబుతున్నారు. వీరికి ఏడాది పాటు శిక్షణలో మెళకువలు నేర్పించి వారిని బస్ డ్రైవర్‌లుగా నియమించనున్నారు.

Tags

Read MoreRead Less
Next Story