చిట్టి గుండెకు శ్రీమంతుడి సాయం..

Read Time:0 Second

సూపర్ స్టార్ మహేష్ బాబు మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు. చిన్నారి గుండె ఆపరేషన్‌కు సాయం చేస్తానని పాప తల్లిదండ్రులకు హామీ ఇచ్చారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి ప్రాంతానికి చెందిన 13 నెలల చిన్నారి సందీప్ గుండెకు సంబంధించిన వ్యాధితో బాధపడుతున్నాడు. గుండెలో మూడు రంధ్రాలు ఉన్నాయని, ఆపరేషన్ చేయాల్సి ఉంటుందని డాక్టర్లు చెప్పారు. తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే కావడంతో దాతల సాయం కోసం ఎదురు చూస్తున్నారు. విషయం తెలుసుకున్న మహేష్‌ బాబు జిల్లా సేవాసమితి స్పందించి హీరో మహేష్‌కు తెలియజేశారు. దీంతో ఆయన స్పందించి విజయవాడలో ఆంధ్రా హాస్పటల్‌లో సందీప్‌కు శస్త్రచికిత్స చేయించేందుకు హామీ ఇచ్చారని సమితి సభ్యుడు ఉంకిలి శ్రీనివాస్ తెలిపారు. ఇదే విషయం చిన్నారి తల్లిదండ్రులకు తెలియజేశామని ఆయన వివరించారు. ఈనెల 14న బాబుకు శస్త్రచికిత్స చేస్తున్నారు.

0 0
Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleppy
Sleppy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Close