అనిల్ రావిపూడి.. నీది మామూలు లక్ కాదు..

Read Time:0 Second

ఒక డైరెక్టర్ తో ఒక సినిమా చేశాక, మళ్ళీ ఆ దర్శకుడికి ఆ హీరో చాన్స్ ఇవ్వడానికి చాలా టైమ్ పడుతుంది. కానీ ఒక్కోసారి ఆ కాంబినేషన్ వెంటనే వర్కవుట్ అవుతుంది. అలాంటిదే సూపర్ స్టార్ మహేష్ బాబు, టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడిది. వీరిద్దరి కాంబినేషన్లో ప్రస్తుతం సరిలేరు నీకెవ్వరూ పేరుతో ఓ సినిమా తెరకెక్కుతోంది. దిల్ రాజు, అనిల్ సుంకర నిర్మాతలుగా ఈ ప్రాజెక్ట్ రూపొందుతోంది. ఫుల్ లెంగ్త్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాని వచ్చే సంక్రాంతి బరిలో దింపడానికి చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.

సరిలేరు నీకెవ్వరూ మూవీ సెట్స్ మీదుండగానే మహేష్ బాబు, దర్శకుడు అనిల్ రావిపూడికి మరో చాన్స్ ఇచ్చాడట. తన వర్కింగ్ స్టైల్ నచ్చడంతో, తనతో మళ్లీ సినిమా చేస్తానని చెప్పాడట. అయితే ఆ ప్రాజెక్ట్ నెక్ట్స్ ఇయర్ పట్టాలెక్కుతుంది. సరిలేరు నీకెవ్వరూ తర్వాత ఓ సినిమా చేసి, ఆ తర్వాత మళ్ళీ అనిల్ సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్ళే ఆలోచనలో ఉన్నాడు మహేష్ బాబు. ఏమైనా అనిల్ రావిపూడిది మామూలు లక్ కాదు.

0 0
Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleppy
Sleppy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published.

Close