రక్తం కారుతున్నా డ్యాన్స్‌ ఆపలేదు

బాలీవుడ్ అభిమానుల్లో ఎప్పటికీ నిలిచిపోయే పాట ఛయ్యా ఛయ్యా. ఈ పాటతోనే బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు నటి మలైకా అరోరా. ఈ సాంగ్ పెద్ద హిట్ సాధించి మలైకా కెరీర్‌ అమాంతం దూసుకుపోయేలా చేసింది. అయితే పాట తెర ముందు అంత అందంగా కనిపించడానికి తెర వెనుక మలైకా కష్టం చాలా పెద్దది. ఈ పాటను చిత్రీకరిస్తున్న సమయంలో ఆమె చాలా తీవ్రంగా గాయపడ్డారట. పాట షూటింగ్ సమయంలో తను ఎదుర్కొన్న అనుభవాలను ఓ రియాల్టీ షోలో అభిమానులతో పంచుకున్నారు. “ఈ పాట చిత్రీకరణ మెుత్తం రైలు పైనే జరిగింది. ట్రైన్ పైనుంచి చాలా సార్లు పడిపోయాను. దీంతో మరోసారి నేను పట్టుతప్పకుండా ఉండడం కోసం నా నడుముకి తాడు కట్టారు. ఆ తాడు సహాయంతో డాన్స్ చేశాను. షాట్ పూర్తియైనా తర్వాత తాడు విప్పుతుంటే నడుము చూట్టూ గాయమయి రక్తమోడింది. దీంతో షూటింగ్‌లో ఉన్నవారంతా ఒక్కసారిగా కంగారుపడిపోయారు’ అని వివరించారు. ఈ పాట బాలీవుడ్‌లో ఓ సంచలనం. ఇప్పటి తరానికి బహుశా ఈ పాటతోనే హింది సినిమా పరిచయం అయి ఉంటుంది. ఇప్పటికీ పాటకున్న క్రేజ్‌ ఏమాత్రం తగ్గలేదు. ఈ పాటకు ఫరా ఖాన్‌ డ్యాన్స్‌ కంపోజ్‌ చేయగా ఏ.ఆర్‌ రెహమాన్‌ స్వరాలందించారు. ఈ సాంగ్‌కు కొరియోగ్రఫీ చేసినందుకు ఫరా ఖాన్‌కు ఫిలింఫేర్‌ అవార్డు లభించింది.

TV5 News

Leave a Reply

Your email address will not be published.

Next Post

గోవా వెళ్లాలనుకుంటున్నారా.. అయితే ఈ ఆఫర్ మీకోసమే..

Fri Jul 26 , 2019
మూడు రోజులు గోవా టూర్. హ్యాపీగా ప్టై‌ట్‌లో వెళ్లి రావొచ్చు. ధర కూడా అందుబాటులోనే. ఎప్పట్నించో విమానం ఎక్కాలన్న మీ కోరిక కూడా నెరవేరుతుంది. అదిరిపోయే ఆఫర్‌ని అందిస్తోంది ఐఆర్‌సీటీసి. టూరిజం సంస్ధ హైదరాబాద్-గోవా టూర్ ప్యాకేజ్‌ను ఆఫర్ చేస్తోంది. టూర్‌లో భాగంగా గోవాలో పేరున్న బీచ్‌లన్నీ చుట్టేయొచ్చు. హైదరాబాద్‌ వాసులు గోవా వెళ్లాలని భావిస్తే ఒక వ్యక్తికి రూ.12,625 చెల్లించాల్సి వస్తుంది. ఇండియన్ రైల్వేస్‌కి సంబంధించిన సంస్థే కాబట్టి […]