ప్రధాని మోదీ భార్యను కలుసుకున్న మమతాబెనర్జీ

ప్రధాని నరేంద్ర మోదీ భార్య జశోదాబెన్ ను కలుసుకున్నారు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ. ఈ సందర్బంగా ఇద్దరు సరదాగా మాట్లాడుకున్నారు. ప్రధాని మోదీతో భేటీ అయ్యేందుకు ఢిల్లీ బయలుదేరిన మమత మంగళవారం రాత్రి కోల్‌కత్తా విమానాశ్రయానికి చేరుకున్నారు. అదే సమయంలో జశోదాబెన్‌ కోల్‌కత్తా నుంచి ధన్‌బాద్‌ వెళ్లేందుకు అక్కడికి వచ్చారు. ఈ సందర్భంగా వారిద్దరూ ఎదురుపడటంతో ఒకరినొకరు పలకరించుకున్నారు. పరస్పరం యోగక్షేమాలు అగిడి తెలుసుకున్న తరువాత.. జశోదాబెన్‌కు మమత చీర బహుకరించారు. కాగా ప్రధాని మోదీతో మమతాబెనర్జీ బుధవారం భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ సందర్బంగా మోదీకి కుర్తా, బెంగాలీ స్వీట్స్‌ను బహుకరించారు మమత.

TV5 News

Leave a Reply

Your email address will not be published.

Next Post

తగ్గనున్న టీవీల ధరలు.. కారణం ఇదే..

Wed Sep 18 , 2019
దేశీయ తయారీ రంగాన్ని ప్రోత్సహించేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఓపెన్ సెల్ టీవీ ప్యానళ్లపై దిగుమతి సుంకాన్ని రద్దు చేసింది. దీంతో ఇండియాలో తయారయ్యే ఎల్ఈడీ, ఎల్సీడి టీవీ ధరలు తగ్గే అవకాశం ఉంది. ఓపెన్ సెల్ టీవీ ప్యానళ్లను ఎల్ఈడీ, ఎల్సీడి టీవీల్లో ఉపయోగిస్తారు. అయితే వీటిపై ప్రస్తుతం 5 శాతం సుంకం వసూలు చేస్తుండగా.. తాజాగా దీనిని పూర్తిగా రద్దు చేసింది […]