బస్టాండ్‌ సమీపంలో వ్యక్తి సజీవ దహనం

జనగాం జిల్లా రఘునాథపల్లిలో దారుణం చోటు చేసుకుంది. గోవర్దనగిరి బస్టాండ్‌ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి సజీవ దహనం అయ్యాడు. దుండగులు పెట్రోల్ పోసి నిప్పంటి హత్య చేసినట్టు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయ బావి వరకు వెళ్తున్న రైతులు ఈ విషయాన్ని గ్రహించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సజీవదహనం అయిన వ్యక్తికి 36ఏళ్లు ఉండవచ్చని పోలీసులు అంచనా వేస్తున్నారు.

TV5 News

Next Post

అక్టోబర్‌లో బ్యాంకులకు సెలవులు..

Fri Oct 4 , 2019
అక్టోబర్ నెలలో బ్యాంకులకు అత్యధిక సెలవులు ఉన్నాయి. శని ఆది వారాలకు తోడు దసరా, దీపావళితో పాటు మరికొన్ని ప్రత్యకమైన రోజులు ఈ నెలలోనే ఉండడంతో దాదాపు పది రోజులపాటు బ్యాంకులు మూతపడనున్నాయి. ఇప్పటికే గాంధీ జయంతికి బ్యాంకుకు సెలవు వచ్చింది. ఇక అక్టోబర్ 6 ఆదివారం, 7 మహార్నవమి, 8 దసరా, 12 రెండో శనివారం, 13 ఆదివారం, 20 ఆదివారం, 26 నాలుగో శనివారం, 27 దీపావళి, […]