పాము కనిపిస్తే చాలు పకోడీలా నమిలేస్తున్నాడు..

Read Time:0 Second

పామంటే ప్రతిఒక్కరికి భయమే.. దాన్ని చూసినా.. విన్నా ఒళ్ళు జలదరిస్తుంది. అలాంటిది పాము కనిపిస్తే చాలు పండగ చేసుకుంటున్నాడో వ్యక్తి. దాని విషాన్ని పాయసంలా.. శరీరాన్ని పకోడీలా నమిలిపారేస్తున్నాడు ఈ వ్యక్తి. ఇతని పేరు వెంకటేశ్వర్లు. ప్రకాశం జిల్లా కొండెపి మండలం నేతివారిపాలెం ఇతని స్వగ్రామం. చిన్నప్పటినుంచి పాములు పట్టడమే ఇతని వృత్తి.. అయితే.. అదే అలవాటుగా కనిపించిన పామునల్లా కొరికి ముక్కలు చేస్తుంటాడు. చుట్టుపక్కల గ్రామాల ఇళ్లలోకి పాము దూరితే ఇతన్నే సంప్రదిస్తుంటారు. ఎంతటి విషసర్పాన్ని అయినా ఇట్టే పట్టేసి మేడలో వేసుకొని ఆటలాడుతుంటాడు.

అంతటితో ఆగకుండా ఆ పామును తలలోని విషాన్ని కక్కించి తాగుతాడు, తన నాలుకను పాము తలలో పెడతాడు. ఇంత చేసినా ఇప్పటివరకు అతని ప్రాణానికి ఎటువంటి ముప్పు ఏర్పడలేదు. చిన్నతనం నుంచే పాముల విషాన్ని సేవించడం వలన అతని శరీరమంతా విషమయమైంది. దాంతో అతను ఏ జంతువును కరిచినా అది అరగంటలో చనిపోతుంది. కానీ అతని ఒంట్లో విషం ఉందని తెలిసినా గ్రామస్థులు అతనితో స్నేహం చేస్తుంటారు. దానికి కారణం అతను ఎవరిని ఏమి అనకపోవడమే. పైగా గ్రామస్తులంతా అతన్ని ముద్దుగా పున్నమినాగు అని పిలుచుకుంటారు.

0 0
Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleppy
Sleppy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Close