సింహానికే సవాలు.. అలాంటివారే మనిషా, జంతువా అని పట్టించుకోరట..

ఢిల్లీ జూలోని సింహం ఎన్‌క్లోజర్‌లోకి ఓ వ్యక్తి దూకడం కలకలం రేగింది. మెటల్‌ గ్రిల్స్‌ దాటి ఆ వ్యక్తి సింహం ఎన్‌క్లోజర్‌లోకి ప్రవేశించాడు. కొన్ని నిమిషాల పాటు అతను సింహంతో పరాచకాలు ఆడాడు.. అయితే అదృష్టవశాత్తు అతనికి ఏమి కాలేదు. బిహార్‌కు చెందిన 28 ఏళ్ల రెహన్ ఖాన్‌ గురువారం ఢిల్లీ ఓ జూ కు వెళ్ళాడు. వెళ్లినవాడు తన మానాన తాను ఉన్నాడా అంతే లేదు. ఎవరు లేని సమయం చూసి సింహం ఎన్‌క్లోజర్‌లోకి ప్రవేశించాడు. అక్కడ ఉన్న భారీ సింహం ముందు కూర్చుని దానితో సంభాషించడం మొదలు పెట్టాడు. ఈ క్రమంలో బయటినుంచి సందర్శకులు అరుస్తూనే ఉన్నా అతను మాత్రం సింహంతో మాట్లాడుతున్నాడు, అంతేకాదు నువ్వు నన్ను ఏం చేయలేవంటూ సింహానికే సవాలు విసిరాడు. అయితే అతను మాట్లాడుతున్న సమయంలోనే ఆ సింహం అతని మీదకు దూకేందుకు ప్రయత్నించింది. అయినా అతను ఏ మాత్రం భయం లేకుండా అక్కడే ఉన్నాడు. దీంతో అప్రమత్తమైన జూ సిబ్బంది అతన్ని చాకచక్యంగా బయటకు తీసుకువచ్చారు. అనంతరం అతన్ని పోలీసులకు అప్పగించారు. అయితే అతని మానసిక పరిస్థితి బాగోలేకపోవడం వల్లనే ఇలా చేశాడని అధికారులు భావిస్తున్నారు.

ఇటువంటి ఘటనలు గతంలో కూడా జరిగాయి. హైదరాబాద్ లో నెహ్రు జూలాజికల్ పార్క్ లో కూడా ఓ వ్యక్తి ఇలాగే చేశాడు. అయితే అతనికి మానసిక స్థితి సరిగానే ఉంది. వాస్తవానికి ఇటువంటి విన్యాసాలు విదేశాల్లో కామన్ గానే జరుగుతుంటాయి. కొంతమంది జంతు ప్రేమికులు ఎటువంటి భయానక జంతువునైనా లొంగదీసుకోవాలనుకుంటారు. ఈ క్రమంలో ఒక్కోసారి ప్రాణాలు కోల్పయిన దాఖలాలు కూడా ఉన్నాయి. సింహాలు, పులుల దగ్గరికి వెళ్లాలనుకునే వ్యక్తులకు కేవలం మానసిక స్థితి సరిగా లేకపోవడమే కారణం కాదని మానసిక నిపుణులు అంటున్నారు. అటువంటి వారు తమకన్నా ఒక జంతువు గొప్ప ఏంటని అనుకుంటారట.. ఇంకా ప్రజల దృష్టిలో తాను అత్యంత దైర్యవంతుడిని అన్న ప్రాపకం కోసం కూడా ఇలా చేస్తుంటారట.. అలాంటి వారు ప్రాణాలను సైతం లెక్కచేయరని ఎదుట ఉంది.. మనిషా.. జంతువా అని పట్టించుకోరని అభిప్రాయపడుతున్నారు. ఏది.. ఏమైనా క్రూర జంతువుల మానసిక స్థితి కూడా అంచనా వేయటం కష్టమని వారు స్పష్టం చేస్తున్నారు.

TV5 News

Next Post

అలా చేస్తే రాష్ట్రంలో ఉన్న జైళ్లు సరిపోవు : నారా లోకేష్

Thu Oct 17 , 2019
ట్విట్టర్ వేదికగా వైసీపీ ప్రభుత్వంపై మరోసారి తీవ్ర విమర్శలు చేశారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. పరిపాలనపై నియంత్రణ కోల్పోయిన జగన్ ..నియంతలా మారారని ఆరోపించారు. పత్రికా స్వేచ్ఛను హరిస్తూ..ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న పాత్రికేయులను మట్టుపెడుతున్నారంటూ మండిపడ్డారు.. మరి మీ తుగ్లక్‌ పాలన గురించి మాట్లాడుకుంటున్న ప్రజలపైనా కేసులు పెడతారా అంటూ నిలదీశారు. పిచ్చిముదిరి ఇలా కేసులు పెడుతూ పోతే రాష్ట్రంలో ఉన్న జైళ్లు కూడా సరిపోవన్నారు లోకేష్. […]