పోలీసుల నుంచి తప్పించుకునేందుకు.. రెండో అంతస్తు నుంచి దూకి..

హైదరాబాద్ మూసాపేట్‌లో దారుణం చోటుచేసుకుంది. పోలీసుల నుంచి తప్పించుకునే ప్రయత్నంలో రెండో అంతస్తు నుంచి దూకారు ఇద్దరు పేకాటరాయుళ్లు. ఈ ఘటనలో జనతానగర్‌ కు చెందిన ప్రవీణ్‌ కుమార్‌ మృతి చెందగా.. మరో వ్యక్తి కాంతారావుకు తీవ్రగాయాలయ్యాయి.

మూసాపేటలోని ఓ భవనంలో కొందరు వ్యక్తులు పేకాట ఆడుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. బుధవారం సాయంత్రం ఎస్‌వోటీ, కూకట్‌పల్లి పోలీసులు సంయుక్తంగా దాడి చేశారు. పేకాడుతున్న ఐదుగురు వ్యక్తుల్లో ముగ్గురిని పట్టుకోగా.. ప్రవీణ్‌కుమార్‌, కాంతారావు తప్పించుకునే క్రమంలో రెండో అంతస్తు పైనుంచి కిందకు దూకారు. ఈ ఘటనలో ప్రవీణ్‌కుమార్‌ అక్కడికక్కడే మృతి చెందగా కాంతారావుకు తీవ్ర గాయలయ్యాయి.

Also watch :

TV5 News

Leave a Reply

Your email address will not be published.

Next Post

నాగార్జున పొలంలో డెడ్ బాడీ..

Thu Sep 19 , 2019
హీరో నాగార్జున పొలంలో మృతదేహం కలకలం రేపుతోంది. షాద్ నగర్ మండలంలోని పాపిరెడ్డి గూడలో నాగార్జున కొనుగోలు చేసిన 40 ఎకరాల వ్యవసాయ భూమిలో మృతదేహం లభ్యమైంది. ఈనెల 10న వ్యవసాయ క్షేత్రంలో నాగార్జున, అమల చెట్లు నాటారు. వ్యవసాయ క్షేత్రంలో సేంద్రియ పంటలు పండించేందుకు ఏర్పాట్లు చేశారు నాగార్జున కుటుంబ సభ్యులు. ఈమేరకు వ్యవసాయసాగుపై నిపుణులను పంపించారు. పొలంలోకి వెళ్లిన నిపుణులు ఒక ప్రాంతంలో ఉన్న గదిలో కుళ్లిపోయిన […]