గర్ల్‌ప్రెండ్‌ని 3వేల అడుగుల ఎత్తున్న శిఖరం పైకి తీసుకెళ్లి అతడు చేసిన పని..

పిచ్చి పీక్స్‌లో ఉంటే ఇలాంటి పిచ్చి పనులే చేస్తారు. వెరైటీగా గర్ల్‌ఫ్రెండ్‌‌కి ప్రపోజ్ చేయాలనుకున్నాడు. అందుకోసం అత్యంత ప్రమాదకరమైన ప్లేస్‌కి తీస్కెళ్లి అక్కడ ప్రపోజ్ చేశాడు. అతడి ప్రపోజల్‌కి ఆమె సర్‌ఫ్రైజ్ అవడం అటుంచి చచ్చేంత భయపడింది. బ్రిటన్‌కు చెందిన క్రిస్టియన్ రిచర్డ్స్ తన గర్ల్‌ఫ్రెండ్ బెక్స్ మార్లేని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. కానీ తన మనసులో మాట చెప్పడానికి తటపటాయిస్తున్నాడు. మంచి రోజు, మంచి ప్లేసు చూసుకొని చెప్పేయాలనుకున్నాడు. అందుకోసం రిచర్డ్స్ నార్వేలోని కెజెరగబోల్టెన్‌లోని 3 వేల అడుగుల ఎత్తైన శిఖరం పైకి బెక్స్‌ని తీసుకొని వెళ్లాడు. ఎక్కడి వెళుతున్నాం అని ఆమె అడిగితే చెప్పలేదు. నీకో సర్‌ఫ్రైజ్ ఇద్దామని అని మాత్రమే చెప్పాడు. అక్కడ రెండు శిఖరాల మధ్య వేళ్లాడుతున్న బండ మీదకు అతి కష్టం మీద అక్కడికి చేరుకున్నారు ఇద్దరు. అప్పుడు అబ్బాయి గారు తన జేబులో రింగు తీసి మోకాళ్ల మీద కూర్చున్నాడు. మనిద్దరం పెళ్లి చేసుకుందాం డార్లింగ్ అన్నాడు. అనుకోని ఈ సంఘటనకి మొదట అవాక్కయినా.. సంతోషంగా ఒప్పుకుంది. ఆమె కళ్లలో ప్రేమ కంటే భయం కనిపించింది అతడికి. ఆమె వేలికి రింగు తొడిగిన వెంటనే సురక్షిత ప్రాంతానికి తీసుకువెళ్లాడు. ఈ జంట ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవడంతో నెటిజన్స్ విరుచుకుపడుతున్నారు. మీరు మాత్రం ఇలాంటి పిచ్చి ప్రయత్నాలు చేసి ప్రాణాల మీదకు తెచ్చుకోకండి అని సలహా ఇస్తున్నారు.

TV5 News

Leave a Reply

Your email address will not be published.

Next Post

కర్ణాటక రాజకీయాల్లో మరో ట్విస్టు

Thu Jul 11 , 2019
కర్ణాటక రాజకీయాల్లో ట్విస్టులు కొనసాగుతున్నాయి. సీఎం కుమారస్వామి గెస్ట్‌ హౌస్‌లో కాంగ్రెస్‌-జేడీఎస్‌ నేతల భేటీ ముగిసింది. రాజీనామా విషయంలో సీఎం కుమారస్వామి వెనక్కి తగ్గారు. సీఎం రాజీనామాకు దారితీసే పరిస్థితుల్లేవని మంత్రి డి.కె.శివకుమార్ అన్నారు. 2008లో యడ్యూరప్ప ప్రభుత్వం ఇలాంటి పరిస్థితే ఎదుర్కొందన్నారు శివకుమార్. అప్పుడు ఆయన కూడా రాజీనామా చేయలేదని గుర్తు చేశారు. ఇప్పుడు అదే పద్ధతిలో కుమారస్వామి కూడా రాజీనామా చేయాల్సిన అవసరం లేదన్నారు. అటు కేబినెట్‌ […]