పాత బస్‌ షెల్టర్‌లో సగం కాలిన మృతదేహం కలకలం

murder

కడప జిల్లా రాజంపేట పాత బస్‌ షెల్టర్‌లో సగం కాలిన మృతదేహం కలకలం రేపింది. బస్‌ షెల్టర్‌లో డెడ్‌బాడీని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. వ్యక్తి వయసు సుమారు 45 ఏళ్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు.

న్యూస్‌ పేపర్లతో వ్యక్తిని తగలబెట్టిన ఆనవాళ్లు అక్కడ కనిపించాయి. కాల్చిన వ్యక్తిని పక్కకు ఈడ్చినట్లు పోలీసులు గుర్తించారు. మృతుడి వివరాల కోసం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

TV5 News

Next Post

తెలంగాణలో అరెస్ట్‌ల పర్వం..

Fri Nov 8 , 2019
శనివారం ఆర్టీసీ జేఏసీ చలో ట్యాంక్‌బండ్‌కు పిలుపునివ్వడంతో పోలీసులు ముందస్తు అరెస్టులు చేస్తున్నారు. మిలియన్ మార్చ్‌ తరహాలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని భావిస్తోంది జేఏసీ. పలు పార్టీల నేతలు కూడా మద్దతు తెలిపారు. దీంతో జిల్లాల నుంచి ఇప్పటికే పెద్ద ఎత్తున కార్మికులును హైదరాబాద్ తరలివస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు ఎక్కడిక్కడ నిర్భందాలు చేస్తున్నారు. ఆర్టీసీ జేఏసీ నేతలతో పాటు.. పలు పార్టీల నాయకుల్ని కూడా అదుపులోకి […]