విడాకులు తీసుకున్న మంచు మనోజ్

టాలీవుడ్ హీరో మంచు మనోజ్‌ నాలుగేళ్ల వివాహ బంధానికి స్వస్తి చెప్పారు. తన భార్య ప్రణతితో విడాకులు తీసుకున్నట్టు సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశాడు. అందులో భార్యభర్తలుగా తమ ప్రయాణానికి ముగింపు పలికాం.. విడిపోయినప్పటికీ ఇద్దరికీ ఒకరంటే ఒకరికి గౌరవం ఉంది. అలాగే ఈ సమయంలో ప్రణతి కుటుంబం ఎంతో అండగా నిలిచిందని పేర్కొన్నారు.

తనకు సపోర్ట్‌గా నిలిచిన ప్రతి ఒక్కరికీ రుణపడి ఉంటానని తెలిపారు. చివరి శ్వాస వరకు సినిమాల్లో కొనసాగుతానని మనోజ్ స్పష్టం చేశారు. కాగా, 2015లో మనోజ్‌, ప్రణతిరెడ్డిల వివాహం జరిగింది. వీరిద్దరూ విడిపోయినట్టు గతంలోనే పలుమార్లు రూమర్లు హల్చల్ చేశాయి. అయితే ఈ రూమర్లను అప్పట్లో ఖండించారు.. తాజగా ఆ విషయాన్నీ నిజం చేశారు.

TV5 News

Next Post

టీడీపీ పొలిట్ బ్యూరో భేటీ వివరాలివే..

Thu Oct 17 , 2019
గుంటూరులోని రాష్ట్ర పార్టీ కార్యాలయంలో అధినేత చంద్రబాబు అధ్యక్షతన తెలుగుదేశం పొలిట్ బ్యూరో సమావేశం జరిగింది. 13 అంశాలు అజెండాగా జరిగిన ఈ భేటీలో ప్రభుత్వంపై పోరాటం, పార్టీ సంస్థాగత నిర్మాణంపై ప్రధానంగా చర్చించారు. పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా పార్టీ కమిటీలు వేసే అంశంపై పునరాలోచన చేయాలని నేతలు అభిప్రాయపడ్డారు. ప్రస్తుతానికి జిల్లా కమిటీలనే కొనసాగించాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. యువత , మహిళలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయం […]