చంకలో ఒక బిడ్డ.. కడుపులో మరో బిడ్డ.. అయినా ప్రియుడితో..

వారిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వారి అన్యోన్యతకు గుర్తుగా మూడేళ్ల కొడుకు ఉన్నాడు. మళ్లీ ఇప్పడు నాలుగు నెలల గర్భంతో ఉంది. అయినా ప్రియుడి మోజులో పడి పరారైంది. వేలూరు జిల్లా గుడియాత్తం గ్రామానికి చెందిన రాజేష్, పూర్ణిమలు నాలుగు సంవత్సరాల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. మొదట కొడుకు పుట్టాడు. మళ్లీ పూర్ణిమ గర్భం దాల్చింది. ఈ క్రమంలో గుడియాత్తం ఇందిరానగర్‌కు చెందిన పార్ధిబన్ పూర్ణిమకు పరిచయమయ్యాడు. అతడికి వివాహం కాలేదు. దీంతో వీరిద్దరూ తరచూ కలిసి మాట్లాడుకునేవారు. భర్త గమనించి పూర్ణిమను మందలించాడు. అయినా వాళ్లిద్దరూ కలుసుకోవడం మానలేదు. ఈనెల 13వ తేదీన పూర్ణిమ ఆసుపత్రికి వెళ్లి వస్తానంటూ వెళ్లిన ఆమె తిరిగి ఇంటికి రాలేదు. భర్త పలు చోట్ల వెతికినప్పటికీ పూర్ణిమ ఆచూకీ తెలియలేదు. అయితే భార్య.. ప్రియుడు పార్థిబన్‌తో కలిసి వెళ్లినట్లు తెలుసుకున్నాడు. ఈ మేరకు పోలీసులకు సమాచారం అందించాడు రాజేష్. పోలీసులు కేసు నమోదు చేసుకుని వీరిద్దరి ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నారు.

TV5 News

Leave a Reply

Your email address will not be published.

Next Post

భారీ భూకంపం.. 150 మంది..

Tue Jun 18 , 2019
వరుస భూకంపాలతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న చైనాను మరోసారి భూకంపం వణికించింది. సిచువాన్ ప్రావిన్స్‌లో భారీ భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.9గా నమోదైంది. ఈ ఘటనలో 15 మంది మృతి చెందగా… 150 మంది తీవ్రంగా గాయపడ్డారు. రాత్రి ఒక్కసారిగా భూమి కంపించడంతో జనం ఇంట్లో నుంచి బయటకు పరుగుల తీశారు. పలు ప్రాంతాల్లో భవనాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. సుమారు 30 నిమిషాల పాటు భూమి […]