విహారంలో విషాదం .. వైద్య విద్యార్థిని దుర్మరణం

prama

విశాఖ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఘటనలో వైద్య విద్యార్థిని దుర్మరణం పాలైంది. ఈ ఘటన మల్కాపురం పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని మారుతి సర్కిల్‌ వద్ద శుక్రవారం తెల్లవారుజామున 2గంటల ప్రాంతంలో జరిగింది. 46వ వార్డు శ్రీహరిపురం, శ్రీనివాస్‌నగర్‌ ప్రాంతానికి చెందిన మొగిలిపురి రవికుమార్‌ చౌదరి పెందుర్తి ఆంధ్రాబ్యాంకులో అసిస్టెంట్‌ మేనేజర్‌గా పనిచేస్తున్నారు. ఇతనికి ఇద్దరు సంతానం. శ్రీవిద్య పెద్ద కుమార్తె. ఆంధ్రా మెడికల్‌ కళాశాలలో ఎంబీబీఎస్‌ తృతీయ సంవత్సరం చదువుతోంది. శనివారం తెల్లవారుజామున తోటి విద్యార్థి లావేటి సంతోష్‌(21), శ్రీదివ్య… కేజీహెచ్‌ నుంచి ద్విచక్రవాహనంపై ముందుగా గాజువాక వెళ్లి..

అక్కడ నుంచి స్నేహితులంతా కలిసి లంబసింగి వెళ్లేందుకు నిర్ణయించుకున్నారు. అయితే ద్విచక్రవాహనం మారుతి సర్కిల్‌ దగ్గరకు రాగానే అదుపుతప్పి పడిపోయింది. దాంతో ఇద్దరు కిందపడ్డారు. దురదృష్టవశాత్తు శ్రీవిద్య తల పైనుంచి లారీ వెళ్ళింది. దీంతో శ్రీవిద్య అక్కడికక్కడే మృతి చెందింది. ద్విచక్ర వాహనం నడుపుతున్న సంతోష్‌ ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డాడు. ఈ ఘటనతో తోటి మిత్రులు కన్నీరుమున్నీ రయ్యారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

TV5 News

Next Post

మాజీ ఎంపీ జితేందర్‌ రెడ్డి అరెస్ట్..

Sat Nov 9 , 2019
మాజీ ఎంపీ జితేందర్‌ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.. ఆర్టీసీ కార్మికులు పిలుపు ఇచ్చిన ఛలో ట్యాంక్ బండ్ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఇతర బీజేపీ నేతలతో కలిసి ఆయన ట్యాంక్‌బండ్‌వైపు వెళ్లే ప్రయత్నం చేశారు. ఆయన్ను పోలీసులు అడ్డుకోవడంతో కాసేపు వాగ్వాదానికి దిగారు.. పరిస్థితి ఉద్రిక్తతంగా మారడంతో.. జితేందర్‌ రెడ్డితో పాటు ఇతర నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.