రాయల్ ఎన్‌ఫీల్డ్.. సైలెన్సర్ లేకుండా సరికొత్తగా..

రాయల్ ఎన్‌ఫీల్డ్.. సైలెన్సర్ లేకుండా సరికొత్తగా..

బైక్ మీద రయ్‌మంటూ దూసుకుపోతే ఆ కిక్కే వేరప్పా. జనం సంచారం లేని రోడ్డు.. 120 స్పీడుతో మేఘాలలో తేలిపోవడం అంటే యూత్‌కి ఎంత సరదానో. కొత్త బైక్ కనిపిస్తే చాలు.. ఓ సారి ట్రై చేయాలనుకుంటారు. పేరుకు తగ్గట్టుగానే ఈ బైక్‌పై ఎక్కితే ఓ రాయల్ లుక్ వచ్చినట్లు ఫీలైపోతుంటారు కుర్రకారు. సౌండ్, లుక్, క్వాలిటీ ఇవన్నీ ఈ బైక్ పట్ల క్రేజ్‌ని పెంచేస్తుంటాయి. మరి కొన్ని కొత్త ఫీచర్లు జోడిస్తూ రాయల్ ఎన్‌ఫీల్డ్ సరికొత్తగా ముస్తాబై థాయ్‌లాండ్ మార్కెట్లో దర్శనమిచ్చింది.

డిస్క్ బ్రేక్స్, 2 ఛానల్ ఏబీఎస్, సెల్ఫ్ స్టార్టర్ వంటివన్నీ యాడ్ చేసింది కంపెనీ. అయితే ఈ ఎలక్ట్రిక్ బైక్‌ని కంపెనీ లాంచ్ చేయలేదు. ఇది కస్టమ్ బైక్. ఇంకా ఈ బైక్‌కి సంబంధించి పెద్ద ఎలక్ట్రిక్ మోటార్, బ్యాటరీని చూడొచ్చు. ఇందులో ఫుల్లీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్ కూడా ఉంది. తాజాగా మార్కెట్లో హల్ చేస్తున్న ఈ ఎలక్ట్రిక్ వెర్షన్ బ్యాటరీ హెల్త్ ఇండికేటర్, స్పింట్ టైమ్స్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. ఇందులో ఎక్స్‌హాస్ట్ లేదు. మరి ఈ బైక్ భారత రోడ్ల మీద ఎప్పుడు కనిపిస్తుందో చూడాలి.

Read MoreRead Less
Next Story