మెగాస్టార్ చిరంజీవి 152వ సినిమా ప్రారంభం

‘సైరా నరసింహరెడ్డి’ విజయంతో మాంచి ఊపుమీదున్న మెగాస్టార్ చిరంజీవి.. మరో సినిమాకు శ్రీకారం చుట్టారు. దసరా మహోత్సవాన్ని పురష్కరించుకొని చిరు 152వ సినిమా ప్రారంభమైంది. సినిమా పూజా కార్యాక్రమాన్ని చిత్ర బృందం నిర్వహించింది. పూజ అనంతరం దేవుడి చిత్రపటాలపై తీసిన ముహూర్తపు సన్నివేశానికి చిరంజీవి సతీమణి సురేఖ క్లాప్‌ కొట్టారు. త్వరలోనే రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభం కానుంది. ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా ఆరునెలల కిందటే అనౌన్స్ అయినా.. కదా చర్చలు పూర్తయ్యేసరికి ఇన్నిరోజులు పట్టినట్టు తెలుస్తోంది. సామాజిక అంశాలతో ఈ చిత్రం స్క్రిప్ట్‌ను కొరటాల శివ రూపొందించినట్లు ఫిలింనగర్ టాక్. కాగా ఈ కార్యక్రమంలో చిరంజీవి, రామ్‌చరణ్‌, కొరటాల శివతో పాటు అంజనీ దేవి, సురేఖ తదితరులు పాల్గొన్నారు.

TV5 News

Next Post

కుప్పకూలిన ప్రభుత్వ కాలేజి భవనాలు

Tue Oct 8 , 2019
విజయనగరం జిల్లా కొత్తవలసలో ప్రభుత్వ జూనియర్‌ కాలేజి భవనాలు ఒక్కసారిగా కుప్పకూలాయి. దీంతో స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. దసరా సెలవులు కావడంతో విద్యార్థులు లేక పెను ప్రమాదం తప్పింది. ఒక వేళ విద్యార్థులు ఉండి ఉంటే భారీగా ప్రాణ నష్టం సంభవించి ఉండేది. కాలేజీ భవనాలు శిథిలావస్థకు చేరుకోవడంతో గతంలోనే విద్యార్థులు, ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి భవనాలను ప్రభుత్వం ముందే గుర్తించి తొలగించాల్సిన అవసరం ఉందని స్థానికులు […]