మెర్సీ కిల్లింగ్‌కు అనుమతి కోరిన వృద్ధురాలు

ఓ డాక్టర్‌ తప్పుడు వైద్యంతో మంచానికే పరిమితమయ్యానని.. డాక్టర్‌పై చర్యలు తీసుకోని పక్షంలో మెర్సీ కిల్లింగ్‌కు అనుమతివ్వాలంటూ ఓ వృద్ధురాలు ప్రజావాణిలో దరఖాస్తు చేసుకుంది. ఈ ఘటన మహబూబాబాద్‌ జిల్లా కేంద్రంలో కలకలం రేపింది. సత్తెమ్మ అనే 80 ఏళ్ల వృద్ధురాలు జ్వరంతో బాధపడుతూ స్థానిక శ్రీసాయి నర్సింగ్‌ హోమ్‌లో డాక్టర్‌ తల్లాడ సతీష్‌ను సంప్రదించింది. ఎలాంటి రక్త పరీక్షలు చేయకుండా మందులు రాసిచ్చాడు. దీంతో కాళ్లు, చేతులు, నడుము పడిపోయి సత్తెమ్మ మంచానికే పరిమితమైంది. ఇది వరకే కలెక్టర్‌కు ఈ విషయంపై ఫిర్యాదు చేస్తే ఒక కమిటీ వేశారని.. ఆ కమిటీ నివేదిక ఇచ్చినా జిల్లా వైద్యాధికారి చర్యలు తీసుకోలేదని బాధితురాలు వాపోయింది. ఇప్పటికైనా అధికారులు స్పందించాలని.. లేనిపక్షంలో మెర్సీ కిల్లింగ్‌కు అనుమతివ్వాలని ప్రజావాణిలో దరఖాస్తు చేసుకుంది.

TV5 News

Leave a Reply

Your email address will not be published.

Next Post

పాకిస్థాన్‌కు మరోసారి ఎదురుదెబ్బ

Tue Aug 6 , 2019
జమ్మూ- కశ్మీర్ విషయంలో పాకిస్థాన్‌కు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. ఒక్కటంటే ఒక్క దేశం కూడా భారత ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబట్టడం లేదు. కశ్మీర్ విషయంలో జోక్యం చేసుకోవాలన్న పాకిస్థాన్ అభ్యర్థనపై సానుకూలంగా స్పందించడం లేదు. అమెరికా, బ్రిటన్ కేంద్రాలుగా వెలువడే పత్రికలు కాస్త నిరసన తెలిపినప్పటికీ, ఆయా ప్రభుత్వాల నుంచి మాత్రం ఎలాంటి వ్యతిరేకత వ్యక్తం కాలేదు. విశేషం ఏంటంటే, పాకిస్థాన్‌ను వెనకేసుకు వచ్చే చైనా కూడా కిమ్మనడం లేదు. […]