ఆర్టీసీ సమ్మెపై ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు. దేశంలో తీవ్ర ఆర్థిక మాంద్యం ఉందన్న ఆయన.. ఆర్టీసీ కార్మికులు సీఎం కేసీఆర్ మాటలను వినాలని కోరారు. సమ్మె సమయంలో కొంతమంది కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడటంపై ఆవేదన వ్యక్తం చేశారు. తొందరపడి ప్రాణాలు తీసుకోవద్దని సూచించారు. కాంగ్రెస్, బీజేపీ నేతల ఉచ్చులో పడవద్దంటూ సూచించారు. త్వరలోనే ఆర్టీసీ కార్మికుల సమస్య పరిష్కారమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
Next Post
మంత్రి అనిల్‌ను అడ్డుకున్న భవననిర్మాణ కార్మికులు
Mon Nov 4 , 2019
నెల్లూరు నగరంలో పర్యటించిన మంత్రి అనిల్‌ను భవన నిర్మాణ కార్మికులు అడ్డుకున్నారు. ఇసుక సమస్యను పరిష్కరించి.. తమకు ఉపాధి కల్పించాలంటూ డిమాండ్ చేశారు. దీనిపై స్పందించిన అనిల్.. ప్రస్తుతం భారీ వర్షాల వల్ల నదులు నిండి ఉన్నాయని, అందువల్లే ఇసుకకొరత ఏర్పడిందన్నారు. త్వరలోనే సమస్యను పరిష్కరిస్తామంటూ భవననిర్మాణ కార్మికులకు హామీ ఇచ్చారు.

You May Like
-
4 months ago
వరద బాధితులకు భారీ సాయం.. బాలీవుడ్ జంట ఔదార్యం
-
2 months ago
దుమారం రేపుతున్న మహారాష్ట్ర బీజేపీ మేనిఫెస్టో
-
5 months ago
మెడలోని పాము మృత్యుపాశమైంది
-
4 months ago
మీసేవా కేంద్రాల్లో లంచాల భాగోతం
-
4 weeks ago
మాతృభాషను కాపాడుకోవాలి: ఏయూ తెలుగు విభాగం