మీ పిల్లలు ఎక్కడ చదువుతున్నారని అడిగితే తప్పేంటి : మంత్రి బొత్స

botsa-satyanarayana

పవన్‌ కళ్యాణ్‌ వ్యాఖ్యలకు మంత్రి బొత్స సత్యనారయణ కౌంటర్‌ ఇచ్చారు. పవన్‌పై సీఎం జగన్‌ వ్యాఖ్యల్లో ఎలాంటి తప్పు లేదన్నారు బొత్స.. పవన్‌ పిల్లలు ఎక్కడ చదువుతున్నారని అడగితే తప్పేంటని ప్రశ్నించారు. ప్రభుత్వం ఏ పని చేసినా.. విమర్శించడమే విపక్షాలు పనిగా పెట్టుకున్నాయని బొత్స ఆవేదన వ్యక్తం చేశారు..

చంద్రబాబు, లోకేష్‌ల తీరుపైనా బొత్స నిప్పులు చెరిగారు. ట్విట్టర్‌ వేదికగా అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. సింగపూర్‌ కంపెనీలు పూర్తిగా ఏపీ నుంచి వెళ్లిపోలేదని.. భవిష్యత్తులో పలు కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నాయన్నారు. ఏపీ రాజధాని 95 శాతం ఎక్కడ కట్టారో చూపించాలని చంద్రబాబును నిలదీశారు. నిజంగా చంద్రబాబు పరిపాలన బాగుంటే ఎందుకు ఓడిపోతారని బొత్స ప్రశ్నించారు.

TV5 News

Next Post

విశాఖ స్మార్ట్‌ సిటీ ప్రాజెక్టుకు కృషి : కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

Wed Nov 13 , 2019
విశాఖ జీవీఎంసీ కార్పొరేషన్‌ పనితీరు ఇంకా మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఉందన్నారు కేంద్ర హోం శాఖ సహాయమంత్రి కిషన్‌ రెడ్డి. విశాఖలో పర్యటిస్తున్న ఆయన జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుపై పలు విభాగాల అధికారులతో సమీక్ష చేశారు. విశాఖ స్మార్ట్‌ సిటీ ప్రాజెక్టు కింద కేంద్రం నుంచి రావాల్సిన 100 కోట్ల నిధులు త్వరగా విడుదల అయ్యేలా కృషి చేస్తాను అన్నారు కిషన్ రెడ్డి. హౌసింగ్‌ కోసం […]