ప్రియుడి మోజులోపడి కన్నబిడ్డలను దారుణంగా..

ప్రియుడి మోజులోపడి ఆమె రాక్షసిగా మారింది. కన్నబిడ్డలపైనే కర్కశత్వాన్ని ప్రదర్శించింది. ప్రియుడితో కలిసి ఇద్దరు చిన్నారులను దారుణంగా హింసించింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగిన ఈ ఘటన కలకలం రేపుతోంది.

భర్త ఓంప్రకాష్ తో వివాదాలు రావడంతో.. రూప అనే మహిళ ప్రియుడు రాజేష్ తో 5 నెలలుగా సహజీవనం చేస్తోంది. ఈ బంధానికి తన ఇద్దరు పిల్లలు హేమశ్రీ, శ్రీ ప్రియ అడ్డుగా ఉన్నారని భావించింది. ప్రియుడితో కలిసి వారిద్దరినీ ఎలక్ట్రిక్ వైర్లతో కొడుతూ.. ఇనుప కత్తితో కాల్చి వాతలు పెట్టారు. ఇద్దరూ కలిసి కొద్ది రోజులుగా పిల్లలను దారుణంగా హింసిస్తున్నారు. దెబ్బలను తట్టుకోలేక పిల్లలిద్దరూ విషయాన్ని తండ్రి తరపు బంధువులకు తెలిపారు. దీంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. పోలీసులు పిల్లల తల్లితోపాటు.. ప్రియుడిపైనా కేసు నమోదు చేశారు.

TV5 News

Leave a Reply

Your email address will not be published.

Next Post

సినిమాల్లో నటిస్తూ.. డెలివరీ బాయ్‌గా ఉద్యోగం చేస్తూ..

Wed Jun 19 , 2019
బ్రతకడానికి ఉద్యోగం కావాలి.. నటించడానికి సినిమా కావాలి. ఒకటి వృత్తి.. మరొకటి ప్రవృత్తి. సినిమాల్లో చిన్న పాత్ర దొరికినా ఎంతో సంతోషం. డబ్బుల కోసం కాదు.. నటన అంటే ఎంతో ఇష్టం. సినిమాలు చూస్తు పెరిగి పెద్దవాడయ్యాడు. సినిమాల్లో ఓ చిన్న పాత్ర అయినా వేయాలని ఎన్నో కలలు కన్నాడు. వచ్చిన ఏ చిన్న అవకాశాన్నీ వదులుకోకుండా నటిస్తున్నాడు. అలా వచ్చిందే సల్మాన్ ఖాన్ ‘భారత్’ అనే సినిమాలో చేతన్ […]