బిజినెస్‌మేన్ ఆడియో రిలీజ్

దూకుడు తర్వాత మరో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకోబోతున్నా. థమన్ చిన్నపిల్లాడి తరహా. బాణీలు కూర్చేప్పుడు ఊగిపోతాడు. ఈ చిత్రానికి కూడా అద్భుత సంగీతం ఇచ్చాడు. జనవరి 11న సినిమా తెరపైకొస్తోంది. ఆరోజు మనందరికీ పెద్ద పండుగ’’ అన్నారు మహేష్. ఈ యువహీరో నటించిన సినిమా ‘బిజినెస్‌మేన్’. కాజల్ కథానాయిక. పూరి జగన్నాథ్ దర్శకుడు. ఆర్.ఆర్.మూవీమేకర్స్ పతాకంపై డావెంకట్ నిర్మించారు. సంక్రాంతి కానుకగా ఈ సినిమా తెలుగు, తమిళ్, మలయాళంలో రిలీజవుతోంది. మూడు వెర్షన్లలోనూ ఆడియో ఆదిత్య ద్వారా రిలీజైంది. తెలుగు సీడీని శ్రీనువైట్ల ఆవిష్కరించారు.
తమిళ్ సీడీని కృష్ణ-విజయనిర్మల దంపతులు రిలీజ్ చేశారు. మలయాళ సీడీని డారామా నాయు డు- రాజమౌళి సంయుక్తంగా ఆవిష్కరించారు. పూరి జగన్నాథ్ మాట్లాడుతూ ‘మహేష్‌తో సినిమా చేయడం మత్తులాంటిది. పదింతలు ప్రతిభను ఒకేసారి చూపిస్తాడు. 74రోజుల్లో సినిమా పూర్తిచేశాం’ అన్నారు. సూపర్‌స్టార్ కృష్ణ మాట్లాడుతూ ‘పోకిరి 75 సంవత్సరాల రికార్డ్‌ను తిరగరాసింది. ‘దూకుడు’ వందేళ్ల చరిత్రను మార్చింది. ఈ సినిమా మరో రికార్డ్ కావాలి’ అన్నారు. ‘థమన్ 3భాషల్లో సంగీతం ఇవ్వడం..ఓ ఛాలెంజ్. దక్షిణాదిన రజనీకాంత్‌కున్న ఇమేజ్ ఈ సినిమాతో మహేష్‌కి రావాలి..అన్నారు రాజమౌళి.
మెమరీ చిప్: ‘బిజినెస్‌మేన్’ పాటల్ని మెమరీకార్డ్‌ను హీరో మహేష్ స్వయంగా ఆవిష్కరించారు. అదే వేదికపై సినిమా వెబ్‌సైట్‌ను అగ్ని ప్రారంభించారు. హైలైట్స్: ఈ సినిమా కోసం మహేష్-పూరి కాంబినేషన్ ఓ పాటను ఆలపించడం విశేషం. కార్యక్రమంలో పూరి స్వయంగా హోస్ట్‌గా మారి మహేష్, కాజల్, నమ్రత, ఛార్మిలను ఆటపట్టిస్తూ...కొన్న ప్రశ్నలను సంధించారు. వాటి సమాధానాలు అహూతులను విశేషంగా అలరించాయి. ఆర్.ఆర్ సంస్థ ఎప్పటిలానే సేవా కార్యక్రమాలకు సంబంధించిన చెక్‌లను ఆయా సంస్థలకు భూరి విరాళంగా పంచింది. కె.అచ్చిరెడ్డి, సురేష్‌రెడ్డి స్వయంగా ఈ చెక్‌లను అందించారు.
ఈ చిత్రానికి కెమెరా: శ్యామ్ కె.నాయుడు, కళ: చిన్నా, ఫైట్స్: విజయ్, డాన్స్: దినేష్, ఎడిటింగ్: ఎస్.ఆర్.శేఖర్, లైన్ ప్రొడ్యూసర్: నీరజ్ శర్మ, సహనిర్మాత: వి.సురేష్‌రెడ్డి, కథ-కథనం-మాటలు- దర్శకత్వం: పూరి జగన్నాథ్.
Published Date : Saturday, 24/12/2011 4:25 PM IST

Be the first comment of this article
| |
|||
|
Don't post rude or nasty comments. Ethnic slurs, personal insults and abuses are rather uncool. Criticise, but know where to draw the line. No point putting in personal details or links, we won't publish them. |