ఎలుకల బాధకు ఇల్లు కాల్చుకున్నట్లే : ఎంపీ రేవంత్‌ రెడ్డి

తెలంగాణ సచివాలయాన్ని కూల్చివేసి కొత్తది నిర్మించాలనే ఆలోచనను సీఎం కేసీఆర్‌ వెంటనే విరమించుకోవాలని… మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు. సచివాలయంలో సీఎస్‌ ఎస్‌.కె.జోషిని కలిసి.. ఈ మేరకు లేఖ అందించారు. 100 ఏళ్లుండే భవనాలను 20 ఏళ్లలోపే కూలగొట్టాలని చూడడం ప్రజాధనాన్ని వృధా చేయడం కాక మరేంటని ప్రశ్నించారు. కేసీఆర్‌ వాస్తు పండితుల సూచనలను పాటిస్తూ… ప్రజలను పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఫైర్‌ సేఫ్టీ లేదన్న కారణంతో భవనాలు కూలగొట్టడమంటే..,. ఎలుకల బాధకు ఇల్లు కాల్చుకున్నట్లే అని రేవంత్‌ రెడ్డి ఎద్దేవా చేశారు.

TV5 News

Leave a Reply

Your email address will not be published.

Next Post

షూటింగులో హీరో సందీప్ కిషన్ కు గాయాలు.. (వీడియో)

Sat Jun 15 , 2019
సినిమా షూటింగ్‌లో హీరో సందీప్‌ కిషన్‌కు గాయాలయ్యాయి.. కర్నూలు జిల్లాలో తెనాలి రామకృష్ణ మూవీ షూటింగ్‌ జరుగుతోంది.. బస్సులో జరిగిన బాంబ్‌ బ్లాస్‌ సన్నివేశాన్ని చిత్రీకరిస్తుండగా సందీప్‌ కిషన్‌కు గాయాలయ్యాయి.. బస్సులోంచి ఎగిరి కింద పడే సీన్‌ను షూట్‌ చేస్తున్నారు. ఆ సమయంలో సందీప్‌ కిషన్‌ కింద పడేలా ఫైట్‌ మాస్టర్‌ ప్లాన్‌ చేశారు.. అయితే, ఫైట్‌ మాస్టర్‌ పొరపాటు వల్ల సందీప్‌ కిందపడ్డ సమయంలో హీరో శరీరం వెనుక […]