ధోనీ పొలిటికల్‌ ఎంట్రీ ?

వరల్డ్‌ కప్‌ తరువాత క్రికెట్‌కు గుడ్‌ బై చెప్పి.. ధోనీ పొలిటికల్‌ ఎంట్రీ ఇవ్వనున్నాడా..? ఇప్పటికే బీజేపీకి స్పష్టమైన సంకేతాలు ఇచ్చాడా.. క్రికెట్‌లో ధనాధన్‌ ఆటగాడిగా.. కూల్‌ కెప్టెన్‌గా ముద్ర వేసుకున్న మహేంద్రుడు.. రాజకీయాలను ఏలేందుకు సై అంటున్నాడా..? బీజేపీ వర్గాలు మాత్రం ధోనీ కచ్చితంగా తమ పార్టీలో చేరుతాడు అంటున్నాయి..

ఇటీవల ధోనీ రిటైర్మెంట్‌పై ప్రచారం ఊపందుకుంది. ఈ వరల్డ్‌ కప్‌లో భారత్ ఆడేదే ధోనికి చివరి మ్యాచ్‌ అని వార్తలు హల్‌చల్‌ చేశాయి. అయితే తానెప్పుడు రిటైర్‌ అవుతానో తనకే స్పష్టత లేదని తన రిటైర్మెంట్‌ ఊహాగానాలపై ధోనీ స్పందించాడు. వాటి సంగతి అలా ఉండగానే.. రిటైర్మెంట్‌ తర్వాత ధోనీ రాజకీయాల్లో చేరుతాడనే ప్రచారం మొదలైంది. ఈ ఏడాది అక్టోబరులో జార్ఖండ్‌ శాసనసభకు జరిగే ఎన్నికల్లో బీజేపీ తరఫున ప్రచారం చేస్తాడని.. సండే గార్డియన్‌ పత్రిక ఒక కథనాన్ని ప్రచురించింది. ఇంగ్లండ్‌ నుంచి భారతదేశానికి రాగానే ధోనీ బీజేపీలో చేరుతాడని ఆ కథనంలో రాసింది. బీజేపీ సర్కారుపై జార్ఖండ్‌ ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోంది. ముఖ్యంగా గిరిజనుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది.

పార్టీపై ఉన్న అసంతృప్తి పోగొట్టుకోవాలి అంటే.. రాష్ట్రానికే చెందిన ధోనీని బీజేపీ తెరపైకి తెస్తోందనే ప్రచారం సాగుతోంది. బీజేపీలో చేరుతానని ధోనీ హామీ ఇచ్చినట్టు రాష్ట్ర నేతలు ఇప్పటికే ప్రకటించారు. ఇప్పటికే కేంద్ర నేతలు సైతం అతడితో సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలుస్తోంది.

TV5 News

Leave a Reply

Your email address will not be published.

Next Post

ఘోర రోడ్డు ప్రమాదం.. 29 మంది దుర్మరణం

Mon Jul 8 , 2019
ఉత్తర్‌ప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లక్నో నుంచి ఢిల్లీకి వస్తున్న ఓ బస్సు… ఆగ్రా వద్ద ఇవాళ ఉదయం డ్రైనేజీ కాల్వలో పడింది. ఈ ప్రమాదంలో 29 మంది ప్రయాణికులు మరణించారు. యూపీ రోడ్‌వేస్‌కు చెందిన స్లీపర్ కోచ్ ప్యాసింజర్ బస్సు యమునా ఎక్స్‌ప్రెస్‌వేపై వేగంగా వస్తూ 15 అడుగుల లోతున్న డ్రైనేజీ కాల్వలో పడిపోయింది. ఈ ఘటనలో 29 మంది ప్రయాణికులు అక్కడికక్కడే చనిపోగా.. మరో మరో […]