చిన్నోడి మెసేజ్‌ చూసి ఆశ్చర్యపోయిన జొమాటో.. గిఫ్ట్‌తో సర్‌ఫ్రైజ్

పిల్లల అమాయకత్వంతో చేసే చిలిపి పనులతో నవ్వులు విరబూస్తాయి. వారికి తెలియక చేసిన పనులే అయినా వాటిలో పరమార్ధం ఉంటుంది. తాజాగా ఓ నాలుగేళ్ల బాలుడు చేసిన పని నెటిజన్ల మనసును దోచుకుంటోంది. సాధారణంగా పిల్లలకు బొమ్మలంటే చాలా ఇష్టం. అవి ఎక్కడ కనపడినా వాటిని వారికి కొనిచ్చేంత వరకు తల్లిదండ్రులను  విడిచిపెట్టారు. వాటితో పాటు ఈ మధ్య వారికి ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ కూడా అలవాటైయ్యాయి. అయితే ముంబైకి చెందిన బాలుడు ఫోన్‌లో ఇంటర్‌నెట్ బ్రౌజ్ చేస్తూ అనుకోకుండా ఫుడ్‌ డెలివరీ యాప్ జొమాటోను ఓపెన్ చేశాడు. అది బొమ్మలు డెలివరీ చేసే సంస్థ అనుకుని కావల్సిన కార్ల బొమ్మలు ఇవ్వాలంటూ ఆ సంస్ధకు మెసేజ్‌ చేశాడు. అది పొరపాటున చేసిన మెసేజైనా ఆ పిల్లాడి కోరికను ఆ సంస్థ తీర్చింది .

ముంబైకి చెందిన ఒక చిన్నారి ప్రముఖ ఫుడ్ డెలివరి సంస్ధ జొమాటోకు ఒక మెసేజ్ పంపాడు. తనకు బెలూన్లు, కార్లు, గిఫ్ట్స్‌ కావాలంటూ మెసేజ్‌లో తెలిపాడు. ఆ మెసేజ్‌ను చూసిన ఆ బాలుడు తండ్రి దాన్ని స్క్రీన్‌షాట్ తీసి ట్విటర్‌లో పోస్ట్ చేశాడు. ‘మావాడు తనకు నచ్చిన వస్తువులు తెమ్మని అమాయకత్వంతో జొమాటోకు మెసేజ్‌ చేశాడు’ అని ట్వీట్‌లో పేర్కొన్నాడు. అది ట్విటర్‌లో వైరల్‌గా మారడంతో జొమాటో స్పందించి ఆ బాలుడికి కావల్సిన బొమ్మలు పంపి ఆనందానికి గురిచేసింది. జొమాటో సర్‌ప్రైజ్‌కు బాలుడి తండ్రి కూడా ఆనందాన్ని వ్యక్తం చేశాడు.

TV5 News

Leave a Reply

Your email address will not be published.

Next Post

పొలంబాట పట్టిన కలెక్టర్‌ దంపతులు

Fri Aug 9 , 2019
ఖమ్మం జిల్లా కలెక్టర్‌ ఆర్‌.వి.కర్ణన్ రైతు సమస్యలు తెలుసుకునేందుకు పొలంబాట పట్టారు. జిల్లా అధికారిగా ఆయన వెళ్లడంలో ఎలాంటి ప్రత్యేకత లేదు.. కానీ ఆయన సతీమణి ప్రియాంక సైతం కూడా ఆయనతో పాటు.. క్షేత్రస్థాయిలో సమస్యలు తెలుసుకునేందుకు వెళ్లడం విశేషం. అయితే ఆమె కూడా జిల్లా ఉన్నతాధికారే కావడం విశేషం. ఆమె ప్రస్తుతం జిల్లా పరిషత్‌ సీఈవోగా పనిచేస్తున్నారు. జిల్లాలోని ఎన్కూరు మండలంలో పలు గ్రామాల్లో పంట పొలాలను పరిశీలిస్తూ.. […]