ఫస్ట్ మార్క్ వచ్చిన స్టూడెంట్‌లా అమ్మ: నానీ

అమ్మ పుట్టిన రోజు అక్టోబర్ 14. ఆరోజు ఫోటోకి ఫోజివ్వమ్మా అంటే కొత్త బట్టలు వేసుకున్న చిన్న పిల్లలా అమ్మ బిగుసుకుపోయింది. యూనిట్‌ టెస్ట్‌లో ఫస్ట్ మార్క్ వచ్చిన విద్యార్ధిలా వినయంగా నిల్చుంది. 30 ఏళ్లుగా ఫార్మాసిస్ట్‌గా ఉద్యోగం చేసి పదవీ విరమణ చేసింది అమ్మ అంటూ ఏడాది క్రితం రిటైర్మెంట్ రోజు అమ్మతో కలిసి దిగిన ఫోటోని నేచురల్ స్టార్ నానీ అభిమానుల కోసం షేర్ చేశారు. అమ్మ పుట్టిన రోజు సందర్భంగా మరోసారి హ్యాపీ బర్త్‌డే అమ్మ.. లవ్ యూ సోమచ్ అంటూ ఇప్పుడు మరో ఫోటో షేర్ చేశారు. నానీ ప్రస్తుతం ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో వస్తున్న వి అనే చిత్రంలో నటిస్తున్నారు. సుధీర్ బాబు, నివేదా థామస్, అదితి రావులు కూడా మరి కొన్ని ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. దిల్ రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

TV5 News

Next Post

20 ఏళ్ల తరువాత భార్యాభర్తలిద్దరూ కలిసి..

Tue Oct 15 , 2019
అందమైన అలనాటి హీరోయిన్.. మంచి కుటుంబ కథా చిత్రాలు తీసే దర్శకుడు.. ఇద్దరూ భార్యాభర్తలై ఎవరి వృత్తుల్లో వారు బిజీగా ఉన్నారు రమ్యకృష్ణ, కృష్ణవంశీలు. వీరిద్దరి కాంబినేషన్‌లో 1998లో చంద్రలేఖ సినిమా వచ్చింది. మళ్లీ ఇప్పుడు 20 ఏళ్ల తరువాత ఇద్దరూ కలిసి ఓ చిత్రం కోసం కలిసి పని చేయనున్నారు. తాజా సమాచారం ప్రకారం కృష్ణ వంశీ తన భార్య రమ్యకృష్ణ ప్రధాన పాత్రలో ఓ చిత్రాన్ని రూపొందించే […]