అగ్రిగోల్డ్‌ ఆస్తుల విషయంలో స్పీకర్‌ తమ్మినేనికి నారా లోకేష్‌ బహిరంగ లేఖ

nara-lokesh

అగ్రిగోల్డ్‌ ఆస్తుల విషయంలో స్పీకర్‌ తమ్మినేని సీతారామ్‌కు.. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ బహిరంగ లేఖ రాశారు. అగ్రిగోల్డ్‌ ఆస్తులతో తనకు సంబంధం ఉందని స్పీకర్‌ చేసిన ఆరోపణలను నిరూపిస్తే.. తాను ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి రాజకీయాలకు దూరంగా ఉంటానని సవాల్‌ విసిరారు. ఒకవేళ ఆరోపణలు అవాస్తవం అని తేలితే మీరేం చేస్తారో చెప్పాలంటూ లోకేష్‌ లేఖలో డిమాండ్‌ చేశారు. సభాపతి స్థానంలో ఉండి ప్రతిపక్షనేతపైనా, మండలి సభ్యుడినైన తనపైనా నిందారోపణలు చేయడం స్పీకర్‌ స్థానానికి సముచితం కాదన్నారు. విలువలతో సభ నడిపించి ట్రెండ్‌ సెట్‌ చేస్తానని చెప్పిన మీరు.. అసభ్య పదజాలంతో మాట్లాడే ట్రెండ్‌ సెట్‌ చేస్తారని అనుకోలేదని లోకేష్‌ లేఖలో విమర్శించారు.

TV5 News

Next Post

ఆర్టీసీ కార్మికుల చలో ట్యాంక్‌బండ్‌

Sat Nov 9 , 2019
ఆర్టీసీ కార్మికుల సమ్మెకు బ్రేకులు పడడం లేదు. ప్రభుత్వం పట్టు వీడకపోవడం.. కార్మికులు మెట్టు దిగకపోవడంతో సమ్మె తీవ్రరూపం దాలుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలతో కార్మికులు హోరెత్తిస్తున్నారు. సమ్మెను మరో స్థాయికి తీసుకెళ్లేందుకు ఆర్టీసీ సంఘాలు చలో ట్యాంక్‌బండ్‌కు పిలుపిచ్చింది. మిలియన్ మార్చ్‌ తరహాలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు జేఏసీ ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే పలు పార్టీల నేతలు కూడా చలో ట్యాంక్‌ బండ్‌కు మద్దతు తెలిపారు. దీంతో జిల్లాల నుంచి […]