జగన్‌పై లోకేశ్ ఫైర్!

కాళేశ్వరం ప్రాజెక్టు కడుతుంటే చంద్రబాబు స్పందించలేదంటూ సీఎం జగన్‌ చేసిన విమర్శలపై… టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్‌ మండిపడ్డారు. జగన్‌ మాటలకు కౌంటర్‌ ఇస్తూ… టీడీపీ కేంద్రానికి ఫిర్యాదు చేసినట్లు పత్రికల్లో వచ్చిన వార్తను ట్వీట్‌ చేశారు. కాళేశ్వరం కడుతుంటే చంద్రబాబు గాడిదలు కాస్తున్నారా..?అని జగన్‌గారు ఎంతో సంస్కారవంతమైన భాషలో అసెంబ్లీలో అడిగారు. జూన్‌ 21 న సాక్షి పత్రికలోనే వచ్చిందని.. అప్పుడు తమరు గుడ్డి గుర్రం పళ్లు తోముతున్నారేమో అంటూ లోకేష్‌ సెటైర్‌ వేశారు.

TV5 News

Leave a Reply

Your email address will not be published.

Next Post

టీటీడీ జేఈవోగా ధర్మారెడ్డినే.. జగన్ నియమించడానికి కారణం ఏంటంటే..

Thu Jul 11 , 2019
టీటీడీ ప్రత్యేక అధికారిగా ధర్మారెడ్డి నియమితులయ్యారు. రేపు ఉదయం ఏడున్నర గంటలకు ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. కాలినడకన కొండపైకి వెళ్లి టీటీడీ ప్రత్యేకాధికారిగా బాధ్యతలు స్వీకరిస్తారు. కేంద్ర సర్వీసుల నుంచి డిప్యూటేషన్‌పై రాష్ట్రానికి వచ్చిన ధర్మారెడ్డి… గతంలో వైఎస్సార్‌ హయాంలోను కొండపై పనిచేశారు. సామాన్యులకు శ్రీవారి దర్శనభాగ్యం కల్పించడంలో ఆయన తెచ్చిన మార్పులు, సంస్కరణలు నేటికీ అమలవుతున్నాయి. టీటీడీ బోర్డులో ప్రక్షాళన కోసం ముఖ్యమంత్రి Y.S జగన్ ఏరికోరి ధర్మారెడ్డినే […]