ఇదేనా మీకు చేతనైన పరిపాలన : నారా లోకేష్ ఫైర్

వైసీపీ ప్రభుత్వంపై మరోసారి ట్విట్టర్‌లో తీవ్ర విమర్శలు చేశారు లోకేష్. కూల్చడాలే లక్ష్యంగా వైసీపీ ప్రభుత్వ పాలన సాగుతోందని మండిపడ్డారు. నెల్లూరు జిల్లా వెంకటేశ్వరపురంలో టీడీపీ నాయకులకు చెందిన 3 ఇళ్లను అక్రమకట్టడాల పేరుతో కూల్చడాన్ని తప్పుపట్టారు. ప్రజలకు రక్షణగా నిలవాల్సిన పోలీసు యంత్రాంగం కూడా వైకాపా దౌర్జన్యాలకు అండగా నిలుస్తుండడం దురదృష్టకరమని ట్వీట్ చేశారు. కక్షసాధింపులు, కూల్చడాలు.. ఇదేనా మీకు చేతనైన పరిపాలన అంటూ జగన్‌ను నిలదీశారు. అధికారం శాశ్వతం కాదు అని గుర్తించుకోవాలంటూ చురకలు వేశారు.

TV5 News

Leave a Reply

Your email address will not be published.

Next Post

విశ్వక్ సేన్ - బెక్కెం వేణుగోపాల్ ల కొత్త చిత్రం "పాగల్"

Wed Aug 14 , 2019
“టాటా బిర్లా మధ్యలో లైలా” ,”మేం వయసుకు వచ్చాం “, “సినిమా చూపిస్తా మామా” లాంటి సూపర్ హిట్ సినిమాలు అందించిన లక్కీ మీడియా బ్యానర్.. రీసెంట్ గా యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ “హుషారు” తో మరో సూపర్ హిట్ కొట్టిన విషయం తెలిసిందే..ఇప్పుడు మరో క్రేజీ లవ్ స్టోరీ నిర్మించబోతోంది. రీసెంట్ గా “ఫలక్ నమా దాస్” తో క్రేజీ సక్సెస్ ను సొంతం చేసుకున్న హీరో […]