విశాఖ తీరంలో ఆకట్టుకున్న నావికాదళ విన్యాసాలు

navy

బుధవారం నేవీ డే సందర్భంగా.. విశాఖ తీరంలో జరిగిన నావికాదళ విన్యాసాలు ఆకట్టుకున్నాయి. నేవీ డేకు ముందు చేసే రిహర్సల్స్‌ అదరహో అనిపించాయి. ఆర్కే బీచ్‌లో ఎయిర్‌క్రాఫ్ట్‌లు, యుద్ధ విమానాలు పెద్ద ఎత్తున శబ్దాలు చేసుకుంటూ జనంపై నుంచి దూసుకెళ్లాయి. హెలీకాప్టర్ల నుంచి సైనికులు తాడు సాయంతో సముద్రంపై దిగడం వంటి సాహసాలు సందర్శకులను కట్టిపడేశాయి.

ఇక తీరం నుంచి ఉగ్రవాదులు చొరబడే సమయంలో నేవీ ఎలాంటి పోరాట పటిమను కనబరుస్తుందో కళ్లకు కట్టినట్లు చూపించారు. సముద్ర జలాల్లో నేవీ చేసిన సాహసాలు గుండె జలదరించేలా చేశాయి. నేవీ రిహార్సల్స్‌ చూసేందుకు ఆర్కే బీచ్‌కు నగర వాసులు భారీగా తరలివచ్చారు.

బుధవారం సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకూ పెద్ద ఎత్తున తూర్పునౌకాదళ విన్యాసాలు జరుగనున్నాయి. ప్రజలంతా తిలకించేలా నేవీ ఏర్పాట్లు చేసింది. ప్రజలు ఉచితంగానే వీటిని తిలకించొచ్చు. ఏపీ గవర్నర్‌ బిశ్వభూషణ్‌, సీఎం జగన్‌ నేవీ వేడుకలను హాజరు కానున్నారు.

TV5 News

Next Post

'దిశ' కేసులో నిందితులను పోలీసులకు అప్పగించే విషయంపై విచారణ

Tue Dec 3 , 2019
దిశ కేసులో నిందితులను విచారించేందుకు తమ కస్టడీకి అప్పగించాంటూ షాద్‌ నగర్‌ కోర్టులో పోలీసులు దాఖలు చేసిన పిటిషన్ మంగళవారం విచారణకు రానుంది. హత్య కేసుకు సంబంధించిన పూర్తి సమాచారం రాబట్టాల్సి ఉందని నిందితులను తమకు అప్పగిస్తే విచారణ చేపడతామని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈనేపథ్యంలో కస్టడీకి అప్పగింతపై కోర్టు నిర్ణయం తీసుకోనుంది. అటు నిందితులను ఉరితీయాలంటూ ప్రజల నుంచి నిరసనలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో చేపట్టాల్సిన చర్యలపై పోలీసులు సమీక్షించారు. […]