ముఖ్యమంత్రితో నెల్లూరు జిల్లా వైసీపీ నేతల సమావేశం

నెల్లూరు వైసీపీ నేతల పంచాయితీ ముఖ్యమంత్రి దగ్గరకు చేరింది.. సాయంత్రం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రితో నెల్లూరు జిల్లా వైసీపీ నేతలు సమావేశం కానున్నారు.. జిల్లాలో నేతల మధ్య వర్గ విభేదాలు, ఆధిపత్య పోరుపై ముఖ్యమంత్రి సీరియస్‌గా ఉన్నారు.. పార్టీ, ప్రభుత్వ వ్యవహారాల్లో నేతల మధ్య సమన్వయ లోపంపై సమావేశంలో చర్చించే అవకాశం ఉంది.. అలాగే ఎమ్మెల్యేలు కోటంరెడ్డి, కాకాణి మధ్య వివాదానికి ఫుల్‌ స్టాప్‌ పెట్టే దిశగా చర్చలు జరగనున్నట్లు తెలుస్తోంది. అలాగే ఈనెల 15న నెల్లూరులో జరగనున్న రైతు భరోసా కార్యక్రమంపైనా చర్చించనున్నారు.

TV5 News

Next Post

సరైన వ్యక్తి కోసం ఎదురు చూస్తున్నా : శృతి హాస‌న్

Wed Oct 9 , 2019
క‌మ‌ల్ గారాల ప‌ట్టి శృతి హాస‌న్ ఒక‌ప్పుడు వ‌రుస సినిమాల‌తో ఇటు తెలుగు అటు హిందీలో బిజీగా ఉండేది. తెలుగులో టాప్ హీరోయిన్‌గా ఉన్న ఈ అమ్మ‌డు చివరిగా కాట‌మ‌రాయుడు అనే చిత్రం చేసింది. ఇటీవ‌ల హిందీలో బెహెన్ హోగీ తేరీ అనే చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. త‌న తండ్రి స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన శ‌భాష్ నాయుడు చిత్రంలో న‌టించింది. ఆ తరువాత అమ్మడు పీకల్లోతు ప్రేమలో పడింది. […]