కానిస్టేబుల్‌ బ్లాక్‌మెయిల్‌.. డబ్బులు ఇవ్వకుంటే కూతురి పెళ్లి అడ్డుకుంటా..

డబ్బుల కోసం బ్లాక్‌మెయిల్‌కు దిగిన ఓ A.R కానిస్టేబుల్‌ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. నెల్లూరు జిల్లా గూడూరులోని తిలక్‌నగర్‌కు చెందిన రవి అనే వ్యక్తి నుంచి 10 వేల రూపాయల లంచం డిమాండ్ చేశారు కానిస్టేబుల్‌ సుదర్శన్. డబ్బులు తీసుకొని కోర్టు సెంటర్‌కు రావాలని ఆదేశించాడు. లేదంటే నీ కూతురు పెళ్లిని అడ్డుకోవడంతో పాటు.. ఎదో ఓ కేసుపెట్టి లోపల వేస్తానని రవిని బెదిరించాడు. దీంతో ఏం చేయాలో అర్థంకాక మీడియాను ఆశ్రయించాడు రవి. వెంటనే CI దశరథ రామయ్యకు సమాచారం  ఇవ్వడంతో సుదర్శన్‌ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.

TV5 News

Next Post

బిల్లు మంజూరు చేసేందుకు రూ. 7 లక్షలు లంచం డిమాండ్‌

Thu Oct 10 , 2019
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో ఓ అవినీతి అధికారి ఏసీబీకి అడ్డంగా దొరికిపోయాడు. KTPS పవర్‌ ప్లాంట్‌ చీఫ్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్న ఆనందం.. ఓ బిల్లు మంజూరు విషయంలో లంచం డిమాండ్‌ చేశాడు. 70 లక్షల విలువైన బిల్లు మంజూరు చేసేందుకు 10 శాతం డబ్బులు ఇవ్వాలని కాంట్రాక్టర్‌ లలిత మోహన్‌పై ఒత్తిడి తెచ్చాడు. రూ. ఏడు లక్షలు తన వల్ల కాదని అనడంతో.. చివరికి రూ.3 లక్షలకు బేరం […]