స్వీటీ అనుష్క అందుకే ఇలా..

స్టార్ హీరోయిన్ అనుష్క బాహుబలి సిరీస్ తర్వాత సెలక్టివ్ గా సినిమాలు చేస్తోంది. బాహుబలిలో దేవసేనగా మెప్పించిన తర్వాత అనుష్కకి అన్ని లాంగ్వేజెస్ లోనూ ఇమేజ్ పెరిగింది. కాకపోతే అనుష్క పర్శనాలిటీ వల్ల కుర్ర హీరోలకు జోడీగా నటించే చాన్స్ లు రావడం లేదు. అందుకే కమర్షియల్ చిత్రాల వైపు కాకుండా స్టోరీ ఓరియంటెడ్ మూవీస్ ని సెలక్ట్ చేసుకుంటోంది. అందులో భాగంగానే భాగమతి చేసి సూపర్ హిట్ అందుకుంది.

ఇప్పుడు స్వీటీ అనుష్క ఖాతాలో ఒకే సినిమా ఉంది. అదే నిశ్శబ్దం. కోనవెంకట్, టిజి విశ్వప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంతో హేమంత్ మధుకర్ అనే కుర్ర దర్శకుడు పరిచయం అవుతున్నాడు. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ బాషల్లో రూపొందుతున్న నిశ్శబ్దం ఫస్ట్ లుక్ పోస్టర్ బుధవారం రిలీజైంది. ఇందులో అనుష్క లుక్ ఆకట్టుకుంటోంది. కథ ప్రకారం అనుష్క ఈ చిత్రంలో మాటలు రాని మూగ ఆర్టిస్ట్ గా కనిపించబోతుంది. దీంతో నిశ్శబ్దంపై ఆడియన్స్ లో ఇంట్రెస్ట్ కనిపిస్తోంది. సినిమాని త్వరలోనే విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

Also watch :

TV5 News

Leave a Reply

Your email address will not be published.

Next Post

రూ.2వేలు ఖరీదు చేసే మద్యం బాటిల్ పై..

Wed Sep 11 , 2019
మునుపెన్నడూ లేని రీతిలో మద్యం అమ్మకాలు జోరందుకున్నాయి. ఉన్న సరుకంతా క్లియర్ చేసుకునే ఉద్దేశంతో దుకాణదారులు మద్యం అమ్మకాలపై భారీ డిస్కౌంట్లు, గిప్ట్ హ్యాంపర్లు ఇస్తూ మందుబాబులను ఆకర్షిస్తున్నారు. నూతన మద్యం పాలసీలో భాగంగా అక్టోబర్ ఒకటో తేదీ నుంచి మద్యం విక్రయాలను ప్రభుత్వమే నిర్వహించనుండడంతో విజయవాడలోని ఓ షాపులో సుమారు రూ.2వేల ఖరీదు చేసే ఒక మందు సీసాపై రూ.300కు పైగా డిస్కౌంట్ ఇస్తున్నారు. దీంతో పాటు ఒకేసారి […]