అంబానీ భార్య ఇక్కడ.. ఆ మాత్రం లేకపోతే ఎలా..

మిలియనీర్ భార్య.. మినిమమ్ మెయింటెయిన్ చేయకపోతే ఎలా.. కట్టుకునే చీర దగ్గర్నుంచి వేసుకునే బ్యాగ్ దాకా అన్నీ వెరైటీగా.. అంతకు మించి కాస్ట్లీగా అనిపించాలి. అందుకే ముఖేష్ అంబానీ భార్య నీతా అంబానీ బ్యాగు వార్తయింది. ఓ మంచి లెదర్ బ్యాగ్ కొనాలంటే వేలల్లో ఉంటుంది. మరి వజ్రాలు పొదిగిన బ్యాగ్ అయితే లక్షలు.. కాదండి.. కోట్లు. అక్షరాలా ఆమె బ్యాగ్ ఖరీదు 2.6 కోట్ల రూపాయలు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ బ్యాంగు హెర్మస్ హిమాలయ బిర్కిన్ కంపెనీకి చెందినది. మొసలి చర్మంతో తయారు చేసినదని తెలుస్తోంది. అక్కడా, ఇక్కడా చెరువులు, కుంటల్లో ఉండే మొసలి కాదండోయ్.. ప్రపంచంలోనే అతి పొడవైన నైలు నదిలో జలకాలాడిన మొసలి చర్మంతో తయారు చేసిన బ్యాగ్‌ అని ప్రముఖ వెబ్‌సైట్ల కథనం. 240 వజ్రాలతో డిజైన్ చేసిన ఈ బ్యాగు.. వజ్రాలు దెబ్బతినకుండా.. రాలిపోకుండా ఉండేందుకు 18 క్యారెట్ల బంగారం పెట్టి మరీ అతికించారు. వజ్రాల హ్యాండ్ బ్యాంగ్ పట్టుకున్న నీతూ అంబానీ.. బాలీవుడ్ బ్యూటీస్ కరిష్మా కపూర్, కరీనా కపూర్‌తో దిగిన ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వజ్రం మెరుపుల ముందు తళుకు బెళుకుల తారల అందం వెలవెలపోతోంది.

TV5 News

Leave a Reply

Your email address will not be published.

Next Post

ఎస్వీఆర్.. ఆయన నటన ముందు ఎవరైనా బలాదూర్..

Tue Jul 2 , 2019
నటనకు నిర్వచనం, పర్యాయపదం అంటూ ఉంటే ఆ పదం పేరు ఎస్.వి. రంగారావు. ఒక నటుడి పేరు చెబితే పాత్రల గురించి మాట్లాడం.. పాత్రల పేర్లు చెబితే ఇది రంగారావు తప్ప.. లేదా రంగారావులా మరెవరూ చేయలేరు అనుకోవడం బహుశా ప్రపంచ సినిమా చరిత్రలో ఒక్క ఎస్వీ రంగారావుకు మాత్రమే సాధ్యమైన విషయం అనిపిస్తుంది. ఆయన నటనకు పాత్రలే పరివశించిపోయాయి. అహంకారం నుంచి ఘీంకారం వరకూ.. ఆప్యాయతల నుంచి అసూయల […]