దిశ ఘటనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన యువకుడి అరెస్ట్‌

disha-comment

దిశ ఘటనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన యువకుడ్ని హైదరాబాద్‌లోని సీసీఎస్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. దిశపై జరిగిన దారుణంపై దేశ వ్యాప్తంగా నిరసనలు మిన్నంటుతుంటే.. కొందరు మాత్రం పిచ్చి పోస్టులతో పైశాచిక ఆనందం పొందుతున్నారు. అలా పోస్టులు చేసిన నిజామాబాద్‌కు చెందిన శ్రీరామ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

దిశకు వ్యతిరేకంగా అసభ్యకర కామెంట్లపై సుమోటోగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. శ్రీరామ్‌పై వయోలేషన్‌, ఐపీసీ యాక్ట్‌ కింద కేసులు నమోదు చేశారు. ఈ తరహా పోస్టులు ఎవరూ చేసినా వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

TV5 News

Next Post

కేంద్రమంత్రి సమాధానం జగన్‌కు చెంప పెట్టులాంటిది - లోకేష్‌

Tue Dec 3 , 2019
ఏపీ సీఎం జగన్‌ తీరుపై మరోసారి ట్విట్టర్‌ వేదికగా నిప్పులు చెరిగారు టీడీపీ జాతీయ కార్యదర్శి లోకేష్‌. ఆరు నెలల్లో తమపై చేసిన ఒక్క అవినీతి ఆరోపణనైనా నిరూపించగలిగారా అంటూ సీఎం జగన్‌ను ప్రశ్నించారు. తన చేతకాని పాలన నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని లోకేష్‌ మండిపడ్డారు. తమ అధినేత చంద్రబాబుపై బురదజల్లబోయి చేతులు కాల్చుకున్న తరువాత కూడా జగన్‌ బుద్ధిలో మార్పు రాలేదని విమర్శించారు. […]