గిరిజన విద్యార్థుల కోసం ఎన్నారైల నిధుల సేకరణ

VITI

తెలుగు రాష్ట్రాల్లోని గిరిజన విద్యార్ధుల చదువుకోసం నిధుల సేకరణకు అమెరికాలో ఎన్నారైలు ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. త్రిదండి చిన్నజీయర్ స్వామి స్థాపించిన వీటీ సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. హ్యూస్టన్ లో కేటీ వీటీసేవా ఆలోక్ ఫండ్ రైజింగ్ పేరుతో నిధులను సేకరించారు. వీటీసేవా సంస్థ ప్రపంచ వ్యాప్తంగా వివిధ సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్టు ప్రెసిడెంట్ అపర్ణ కమటం తెలిపారు. ఈవెంట్ ద్వారా సేకరించిన విరాళాలను అదిలాబాద్ జిల్లాలోని అల్లంపల్లి, బీర్సాయిపేట, ఏపీలో కటారువారి పాలేం గ్రామాల్లోని జీయర్ గురుకుల గిరిజన విద్యార్ధులకు అందించనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎన్నారైలతోపాటు పలువురు విద్యార్ధులు సైతం పాల్గొన్నారు.

TV5 News

Next Post

విజయవాడ రోడ్లపై కొట్టుకోవడానికి కూడా రెడీ: పవన్

Tue Nov 12 , 2019
సీఎం జగన్ తనపై చేసిన విమర్శలకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. జగన్ భాషా సంస్కారాన్ని మర్చిపోయిన మాట్లాడినా.. తాను మాత్రం పాలసీలపైనే ప్రశ్నిస్తానని చెప్పారు. తాను 3 పెళ్లిల్లు చేసుకుంటే సీఎం జగన్‌కు వచ్చిన ఇబ్బంది ఏంటో అర్థం కావడం లేదని అన్నారు. కావాలంటే మీరు చేసుకోండంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఒక రాష్ట్రానికి సీఎం అన్న సంగతి మర్చిపోయి జగన్ మాట్లాడుతున్నారని పవన్ ఫైర్ […]