తోటి ఆర్టిస్టుని ఇలాగేనా.. నెటిజన్స్ ఫైర్.. వీడియో

డబ్బు, పలుకుబడి, గ్లామర్ రాజ్యమేలుతున్న ఈ ప్రపంచంలో ఓ బిచ్చగత్తె సెలబ్రెటీగా మారడాన్ని తట్టుకోలేకపోయాడు. తన అతి తెలివి తేటలు ప్రదర్శించి నెటిజెన్స్ చేతిలో అడ్డంగా బుక్కయ్యడు ఒడిశా కమెడియన్. ప్రతిభ ఉన్న రాణూ మోండల్ని బాలీవుడ్ సంగీత దర్శకుడు హిమేశ్ రేష్మియా స్టూడియోలో పాట పాడిస్తుంటే.. అది అతడికి కామెడీగా అనిపించినట్లుంది. తన పాండిత్యాన్ని ప్రదర్శించి టిక్‌టాక్ చేశాడు. కమెడియన్ పప్పు పామ్ పామ్‌గా ఫేమస్ అయిన తత్వా ప్రకాశ్ సతపతి.. రాణు పాడిన పాటని ఇమిటేట్ చేశాడు. తనని కించపరిచే విధంగా ఆమెలాగే చీర కట్టుకుని, ఆమెలా హావభావాలు పలికిస్తూ రాణును అనుకరించాడు. అదే సమయంలో మరో వ్యక్తి దర్శకుడు హిమేశ్ రేష్మియాలా పప్పును ఉత్సాహపరిచాడు.

తాను చేసిన ఈ గొప్ప వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు పప్పూ. దాంతో నెటిజన్లు పప్పూ మీద ఫుల్లు ఫైరయ్యారు. తోటి ఆర్టిస్ట్ ప్రతిభను గుర్తించలేని మనిషివి.. నువ్వేం ఆర్టిస్టువయ్యా అంటూ అతడిపై విరుచుకుపడుతున్నారు. పప్పూకి పిచ్చెక్కిందేమో. మతిస్థిమితం తప్పినట్టుంది. ఓసారి సైక్రియాటిస్టుకి చూపించుకుంటే మంచిది. తోటి కళాకారిణిని అవమానించే ముందు నువ్వెంటో తెలుసుకో.. అనేముందు ఆలోచించడం నేర్చుకో అంటూ ఘాటుగా స్పందిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా ప్రకాశ్ సతపతి వర్సెస్ పప్పూని ఉతికి ఆరేస్తున్నారు.

TV5 News

Leave a Reply

Your email address will not be published.

Next Post

భారీగా ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనం

Fri Aug 30 , 2019
* భారీగా ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనం *10 బ్యాంకుల విలీన ప్రక్రియకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ *నాలుగు బ్యాంకులుగా అవతరించనున్న 10 పీఎస్‌యూ బ్యాంకులు *కెనరా బ్యాంకులో విలీనం కానున్న సిండికేట్ బ్యాంక్ *యూనియన్ బ్యాంక్‌లో ఆంధ్రా బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్ విలీనం *పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో ఓరియెంటల్ బ్యాంక్, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విలీనం *అలహాబాద్ బ్యాంక్‌లో ఇండియన్ బ్యాంక్ విలీనం *ఇకపై దేశంలో మొత్తం […]