బ్రాండెడ్ వంట నూనెలో పామాయిల్ కలిపి..

ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలో అక్రమ ఆయిల్ దందా గుట్టు రట్టు అయ్యింది. శ్రీనివాస ఏజెన్సీపై పోలీసులు, ఇంఛార్జి జిల్లా ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్‌ దాడులు నిర్వహించారు. 4 వేల లీటర్ల వంట నూనెను స్వాధీనం చేసుకొని నూనె నమూనాలను సేకరించి ల్యాబ్‌కు తరలించారు.

శ్రీనివాస ఏజెన్సీలో బ్రాండెడ్ వంట నూనెలో పామాయిల్ పోసి అమ్ముతున్నారని పలు ఫిర్యాదులు అందడంతో పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో నాలుగు వేల లీటర్ల వంట నూనెను స్వాధీనం చేసుకున్నారు. ఇందులో ఎక్స్‌పైరీ డేట్‌ అయిన ఆయిల్‌ కూడా లభించింది. ఈ తనిఖీల్లో స్వాధీనం చేసుకున్న వంట నూనెల నమూనాలను ల్యాబ్‌కు పంపారు. 14 రోజుల్లో రిపోర్ట్ వస్తుందని.. అమ్మేది నాసిరకం నూనె అని తెలితే యజమానిపై క్రిమినల్‌ కేసు నమోదు చేస్తామన్నారు పోలీసులు.

Also watch :

TV5 News

Leave a Reply

Your email address will not be published.

Next Post

ప్రభుత్వ అధికారిక లాంచనాలతో శివప్రసాద్ అంత్యక్రియలు పూర్తి

Sun Sep 22 , 2019
చిత్తూరు మాజీ పార్లమెంట్‌ సభ్యులు, విలక్షణ నటులు నారమల్లి శివప్రసాద్‌ అంత్యక్రియలు ముగిశాయి. బంధుమిత్రుల ఆశ్రునయనాల మధ్య ఆయన పార్ధీవదేహాన్ని ఖననం చేశారు. ప్రభుత్వ అధికారిక లాంచనాలతో.. శివప్రసాద్‌కు అంత్యక్రియలు నిర్వహించారు. అంతకు ముందు తిరుపతి నుంచి ఆయన స్వస్థలం చంద్రగిరి మండలం పులిత్తివారిపల్లి సమీపంలోని అగరాల వరకు అంతిమ యాత్ర నిర్వహించారు. ఈ యాత్రలో ఆయన అభిమానులు, టీడీపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. శివప్రసాద్‌ అంతిమయాత్రలో టీడీపీ […]