స్పీకర్‌గా ఓం బిర్లా ఎన్నికపై కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి హర్షం

17వ లోక్‌సభ స్పీకర్‌గా బీజేపీ ఎంపీ ఓం బిర్లా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దిగువసభలో దాదాపు అన్ని రాజకీయ పార్టీలు ఓం బిర్లాకు మద్దతు తెలిపాయి. సభ ప్రారంభమైన వెంటనే ఓం బిర్లా పేరును ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిపాదించారు. కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్‌ సింగ్‌, అమిత్‌ షా, గడ్కరీ, బిర్లా పేరును బలపరిచారు. ఇతర పార్టీల నుంచి నామినేషన్లు రాకపోవడంతో బిర్లా ఎన్నిక ఏకగ్రీవమైంది.

బీజేపీ యువమోర్చా నాయకుడిగా పనిచేసిన ఓం బిర్లా… లోక్‌సభ స్పీకర్‌గా ఎన్నికవడం చాలా ఆనందంగా ఉందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌ రెడ్డి అన్నారు. నాడు యువ నాయకులుగా ఉన్న వారంతా ఇప్పుడు దేశాన్ని నడిపించే స్థాయిలో ఉండడం హర్షణీయమన్నారు.. కిషన్‌ రెడ్డి.

TV5 News

Leave a Reply

Your email address will not be published.

Next Post

తల్లి, కొడుకు అనుమానస్పద మృతి

Wed Jun 19 , 2019
విశాఖ జిల్లాలో తల్లి కొడుకుల అనుమానస్పద మృతి కలకలం రేపింది. పెడగంట్యాడ మండలం హౌసింగ్ బోర్డులో ఈ ఘటన చోటుచేసుకుంది. హౌసింగ్ బోర్డుకు చెందిన రామశాస్త్రికి అనకాపల్లి మండలం కొత్తూరుకు చెందిన మల్లికా జయంతితో వివాహం జరిగింది. వీరికి పన్నెండేళ్ల ఒక కూతురు, బాబు ఉన్నారు. ఏం జరిగిందో తెలియదు..తల్లి మల్లికా, కొడుకు కౌశిక్ ఫ్యాన్ కు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. భర్త రామశాస్త్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు […]