ఇదేం బిజినెస్ రా బాబు.. ఆన్‌లైన్‌లో పుర్రెల వ్యాపారం

ఇంకేం దొరకలేదా నాయనా.. ఈ వ్యాపారం మొదలెట్టావ్.. ఏంటీ పుర్రెలు కావాలని ఒక్క ఫోన్ కొడితే ఇంటికి తీసుకొచ్చి మరీ ఇస్తారా.. అవునండీ ఇప్పుడంతా స్మార్ట్ ప్రపంచం కదా. అర చేతిలో ఫోన్ వుంటే చాలు.. అన్ని వస్తువులు ఆఖరికి పుర్రెలు కూడా గుమ్మంలోనే. ఈ పుర్రెల కోసం ఎంత డబ్బిచ్చైనా ఎగబడి మరీ కొనేస్తున్నారట. ఆన్‌లైన్ వేదికగా బ్రిటన్‌లో పుర్రెల వ్యాపారం జోరుగా సాగుతోంది. ఎంతగా అంటే మూడు పుర్రెల ఖరీదు ఆరు పౌండ్ల రేటు పెట్టి కొనేస్తున్నారు బ్రిటన్ వాసులు. వ్యాపారం ప్రారంభించిన రెండేళ్లలోనే ఇండియన్ కరెన్సీ ప్రకారం రూ.70 లక్షలకు పైగా విలువ చేసే పుర్రెలు, ఎముకలు అమ్ముడుపోయాయని ఇంగ్లీషు పత్రిక ‘ది సన్’ తెలిపింది. ఇన్‌స్టాగ్రామ్‌‌లో అకౌంట్లు ఓపెన్ చేసి మరీ వ్యాపారం సాగిస్తున్నారని రాసుకొచ్చింది.

ఇంతకీ అంతరేటు పెట్టి ఎందుకు పుర్రెలు కొంటున్నారని ఆరా తీస్తే.. ప్రయోగాల కోసం పరిశోధనల నిమిత్తంగా పుర్రెల్ని కొంటున్నారట. బ్రిటన్‌లో వీటి అమ్మకాలపై ఏమాత్రం నిషేధం లేదు. అందుకే వారి బిజినెస్ మూడు పుర్రెలు.. ఆరు ఎముకలుగా సాగిపోతోంది. గతంలో వీటిని ‘ఈబే’ ఇ-కామర్స్ వెబ్‌సైట్ ద్వారా కొనేవారు. ఇప్పుడు ఆసైట్ అందుబాటులో లేకపోవడంతో ఇన్‌స్టాలో షాపులు ఓపెన్ చేసి అమ్మకాలు సాగిస్తున్నారు. ఇవన్నీ ‘స్కెలిటన్’ హ్యాష్‌ట్యాగ్‌తో వ్యాపార లావాదేవీలు సాగిస్తున్నాయి. ఇక పుర్రె సైజుని బట్టి రేటుని డిసైడ్ చేస్తారు. బ్రిటన్‌‌లో ఈ బిజినెస్ ఏడాదికి రూ.40లక్షల మేర సాగుతోందంటే ఆశ్చర్యంగానే ఉంది. హెన్సీ స్క్రాగ్ అనే ఓ పుర్రెల వ్యాపారికి తన ఇన్‌స్టాగ్రామ్‌లో 40 వేల మంది ఫాలోయర్స్ ఉన్నారట. పుర్రెకో బుద్ది జిహ్వకో రుచి అంటే ఇదే కదా మరి.

TV5 News

Leave a Reply

Your email address will not be published.

Next Post

రాష్ట్రంలో J-టాక్స్ గుబులు.. జగన్ పాలన అపూర్వం : నారా లోకేష్

Wed Aug 7 , 2019
వైఎస్‌ జగన్ పాలనపై తీవ్ర విమర్శలు చేశారు టీడీపీ జాతీయ కార్యదర్శి లోకేష్. ఈ రెండున్నర నెలల్లో అంతా కమిటీలు, కమీషన్‌లే నడిచాయని ఆరోపించారు. వైసీపీ నేతలంతా గాల్లో తిరుగుతూ..భూమిపై సమస్యలను పట్టించుకోవడం లేదన్నారు. పశ్చిమగోదావరి జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు లోకేష్. మొత్తం 50వేల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని..ఎకరాకు 10వేల చొప్పున పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.. రాజధాని అమరావతిని నిర్మించే ఉద్దేశం వైసీపీ ప్రభుత్వానికి […]