జులై 1నుంచి కొత్త రూల్స్..

ఆర్థిక వ్యవహారాలపై ప్రభావం చూపే పలు అంశాలు జులై 1 నుంచి మారనున్నాయి. బ్యాంకుల దగ్గర నుంచి కార్ల కంపెనీల వరకు పలు విషయాల్లో మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఆన్‌లైన్‌లో డబ్బులు పంపించేందుకు చార్జీలు వసూలు చేయవద్దని భారతీయ రిజర్వు బ్యాంక్ ఇప్పటికే బ్యాంకులను ఆదేశించింది. ప్రభుత్వ రంగ దిగ్గజ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) కస్టమర్లకు తీపి కబురు అందించింది. ఎస్‌బీఐ తన హోమ్ లోన్స్‌పై వడ్డీ రేటును రేపో రేటు తగ్గినప్పుడల్లా తగ్గిస్తుంది. ఆర్‌బీఐ కొత్త నిబంధనల ప్రకారం బ్యాంకులో బేసిక్ అకౌంట్ కలిగిన వారు మినిమమ్ బ్యాలెన్స్ కలిగి ఉండాల్సిన అవసరం లేకుండానే ఇతర సేవలు పొందొచ్చు. నాలుగు సార్లు ఏటీఎం నుంచి ఉచితంగా డబ్బులు విత్ డ్రా చేసుకోవచ్చు. బ్యాంక్ బ్రాంచుల్లో ఎన్నిసార్లైనా నగదు డిపాజిట్ చేయవచ్చు. అలాగే ఏటీఎం కమ్ డెబిట్ కార్డును ఫ్రీగా పొందొచ్చు. ఈ నిబంధన జులై 1 నుంచి అమలులోకి వస్తుంది. వాహన కంపెనీలైన టాటా మోటార్స్ ఇప్పటికే కార్ల ధరలు పెంచేసింది.  హోండా కార్స్ కూడా వచ్చే నెల నుంచి ధరలు పెంచబోతోంది. మహీంద్రా కంపెనీ కార్ల ధరలు కూడా జులై 1 నుంచి రూ.36,000 పెరగనున్నాయి.

TV5 News

Leave a Reply

Your email address will not be published.

Next Post

కరువు ముప్పు ముంచుకొస్తుంది..ఇక ఆకలి చావులేనా?

Thu Jun 27 , 2019
భారతదేశానికి కరువుముప్పు ముంచుకొస్తుంది. వర్షాభావ పరిస్థితులు దేశాన్ని కలవరపెడుతున్నాయి. 42 శాతానికిపైగా భారత భూభాగంలో తీవ్ర కరువు పరిస్థితులు నెలకొన్నాయని డ్రాట్ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ వెల్లడించింది. గతేడాదితో పోలిస్తే ఇది 6% అధికమని తెలిపింది. మే 21 నాటికి 42.18శాతంగా ఉన్న కరువు ప్రాంతం మే 28నాటికి 42.61 శాతానికి పెరిగింది. గతేడాది మే 28 నాటికి దేశంలో 36.74శాతం భూభాగంలో కరుపు పరిస్థితులు నెలకొన్నట్లు పేర్కొంది. తెలంగాణ, […]