రాజ్ తరుణ్ హీరోగా.. ‘ఒరేయ్.. బుజ్జిగా’

‘ఏమైంది ఈవేళ’, ‘అధినేత’, ‘బెంగాల్‌ టైగర్‌’, ‘పంతం’ వంటి సూపర్ హిట్‌ చిత్రాలు నిర్మించిన ప్రముఖ నిర్మాత కె కె రాధామోహన్ శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌ పతాకంపై యంగ్ హీరో రాజ్ తరుణ్ కథానాయకుడిగా ‘గుండె జారి గల్లంతయ్యిందే’ ఫేమ్ కొండా విజయ్‌కుమార్‌ దర్శకత్వంలో నిర్మిస్తున్న కొత్త చిత్రం, ‘ఒరేయ్.. బుజ్జిగా’.. హీరో రాజ్ తరుణ్, మాళవిక నాయర్ హీరో హీరోయిన్లు గా నటిస్తున్న చిత్రంలో వాణి విశ్వనాధ్, నరేష్, పోసాని కృష్ణమురళి, సప్తగిరి, రాజా రవీంద్ర, అజయ్ ఘోష్, అన్నపూర్ణ, సిరి, జయలక్ష్మి, సోనియా చౌదరి, సత్య, మధునందన్ ముఖ్య పత్రాలు పోషిస్తున్నారు. సెప్టెంబర్ 10 నుండి నిరవధికంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రానికి, సంగీతం: అనూప్ రూబెన్స్, నిర్మాత: కె కె రాధామోహన్.. కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: కొండా విజయ్‌కుమార్‌.

TV5 News

Leave a Reply

Your email address will not be published.

Next Post

ఆ మహిళలకు వెంటనే పరిహారం అందించండి

Tue Sep 10 , 2019
మహిళా శిశు సంక్షేమంపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దృష్టిపెట్టారు. మంత్రులు, ఉన్నతాధికారులతో కలిసి మహిళా శిశు సంక్షేమ శాఖపై సమీక్ష నిర్వహించారు. సంక్షేమ పథకాల అమలుపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. సంక్షేమ పథకాల అమల్లో అనుసరిస్తున్న విధానాలు పథకాలను నిరాకరించేలా ఉండకూడదన్నారు. బయోమెట్రిక్‌, ఐరిస్‌, వీడియో స్క్రీనింగ్‌ వంటివన్నీ ఆ పథకం లబ్ధిదారుడికి చేరేందుకు ఉపయోగపడాలన్నారు. అటు గ్రామాల నుంచి వస్తున్న అత్యవసర విషయాలపై ప్రభుత్వ యంత్రాంగం స్పందించేందుకు ప్రత్యేక […]