వేధింపులు భరించలేక ఉద్యోగి ఆత్మహత్యాయత్నం

murdered

రాజకీయనాయకుల ఒత్తిళ్లతో గుంటూరు జిల్లా తెనాలికి చెందిన ఔట్ సోర్సింగ్ ఉద్యోగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. స్థానిక మార్కెట్ యార్డ్‌లో షేక్ రజాక్ అనే యువకుడు ఒప్పంద ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. వికలాంగుడు అయిన షేక్ రజాక్ కు గత ప్రభుత్వం ఉపాధి కల్పించింది. అయితే ప్రభుత్వం మారిన తర్వాత రజాక్ కు వేధింపులు ఎక్కువయ్యాయి. అధికారపార్టీకి చెందిన కొందరు నాయకులు వేధించడం మొదలుపెట్టారు. దీంతో ఉద్యోగం చేయలేక.. కుటుంబాన్ని పోషించలేక తన కష్టాన్ని సెల్ఫీ వీడియో ద్వారా వెల్లడించి లైవ్ లోనే ఆత్మహత్యకు ప్రయత్నించారు. వెంటనే స్నేహితులు అప్రమత్తమై.. రజాక్ ను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం గుంటూరు ప్రభుత్వం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

 

 

TV5 News

Next Post

కలకలం సృష్టిస్తోన్న చిన్నారి అదృశ్యం

Mon Nov 11 , 2019
విజయవాడ భవానీపురం పీఎస్ పరిధిలో 8 ఏళ్ల బాలిక అదృశ్యం స్థానికంగా కలకలం రేపుతోంది. గుంటుపల్లి నల్లకుంటకు చెందిన ద్వారక.. ఇంటి దగ్గర ఆడుకుంటూ.. ఆదివారం మధ్యాహ్నం నుంచి కనిపించకుండా పోయింది. బాలిక మిస్సింగ్‌పై తల్లిదండ్రులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. ద్వారక అదృశ్యం కేసు నమోదు చేసుకున్న భవానీపురం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే రోజు గడిచిపోవడంతో.. పాప ఎలా ఉందోనని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.